DailyDose

రాజమండ్రి సీఐ ఎస్ఐలు సస్పెన్షన్-నేరవార్తలు

Crime News - Rajahmundry CI SI Suspended

* రాజమహేంద్రవరం పోలీస్ అర్భన్ జిల్లా. రాజమండ్రి ఒకటవ పట్టణ సిఐ, ఎస్ఐ లను సస్పెండ్ చేసిన ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహనరావు IPS. ఒక కేసు విషయంలో రికవరీ సొమ్ము,బంగారం మాయంపై సిఐ, ఎస్ఐ లపైఆరోపణలు. ఉన్నతాధికారుల విచారణ అనంతరం సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసిన డిఐజి కె.వి.మోహనరావు IPS.

* అనంతపురం జిల్లా సోమందేపల్లి పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేసి 427 టెట్రా పాకెట్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

* అనంతపురం ఏసీబీ వలలో ఇరిగేషన్ శాఖ డీఈ మోహన్ గాంధీ.చిత్రావతి రిజర్వాయర్ ముంపు గ్రామ బాధితురాలితో రెండు లక్షలు డిమాండ్ చేసిన మోహన్ గాంధీ.ముదిగుబ్బ మండలం రాఘవంపల్లి కి చెందిన లీలావతికి 21 లక్షలు పరిహారం మంజూరు.డబ్బు ఇచ్చేందుకు రెండు లక్షలు డిమాండ్ చేసిన డీఈ మోహన్ గాంధీ.

* భారత నావికా దళానికి చెందిన శిక్షణ విమానం మిగ్‌-29కే అరేబియన్‌ సముద్రంలో కూలినట్లు నేవీ అధికారులు వెల్లడించారు.

* రాజ్​కోట్​లోని కొవిడ్​ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

* కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌-హరియాణా రైతులు చేపట్టిన ‘ఛలో దిల్లీ’ కార్యక్రమంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.దిల్లీ వైపు సాగుతున్న రైతులను సింఘు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.రైతులు దిల్లీలోకి వెళ్లకుండా సాయుధ పోలీసులు నిలువరించేందుకు యత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.దిల్లీ-బహదుర్‌గఢ్‌ రహదారికి సమీపంలో టిక్రీ బోర్డర్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోన్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కెనాన్లు, బాష్పవాయువు‌ ప్రయోగించారు.

* రాజౌరీ జిల్లాలోని సుందర్బనీ సెక్టార్​లో నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి కాల్పులకు తెగబడి.. మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.

* దేశంలో కరోనా బాధితులకు చికిత్స, వైరస్​ నియంత్రణ, ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై సుప్రీం కోర్టు విచారించింది.ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు కరోనా మార్గదర్శకాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.గుజరాత్​ కరోనా ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదాన్ని సుమోటోగా తీసుకుంది సుప్రీం.కరోనా బాధితులకు చికిత్స, మృతదేహాల నిర్వహణపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

* ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కడప-తిరుపతి హైవేపై రోడ్డు ప్రమాదం..కంచి నుండి మంత్రాలయం వెళుతున్న కారు జోరున వర్షం కురుస్తుండటంతో రోడ్డు పై నుండి ప్రమాదవశాత్తూ ఒంటిమిట్ట చెరువులోకి దూసుకెళ్లిన వైనం..సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టిన ఒంటిమిట్ట సి.ఐ హనుమంత నాయక్, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రాజా..చెరువు లోకి దూసుకెళ్లిన కారులో నుండి సురక్షితంగా బయట పడ్డ ప్రయాణికులు…బాధితులను పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం వెంటనే ఒంటిమిట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన సి.ఐ హనుమంత నాయక్, సిబ్బంది..