ScienceAndTech

ఎక్స్‌పైరీ తేదీ ఎలా నిర్ణయిస్తారు?

How are expiry dates decided? - Telugu tech news

మనం తీసుకునే ప్రతి ఔషధంపై ఎక్స్‌పైరీ తేదీలు ఉంటాయి. వాటిని ఎన్ని రోజులు ఉపయోగించాలనేది తేదిలతో నిర్ణయిస్తారు. పార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే ఏ ఔషధమైనా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. ఔషదాలకు డేట్ ఆప్ ఎక్స్‌పైరీని నిర్ణయించడంలో వివిద రకాలైన పరీక్షలను నిర్వహిస్తుంటారు. ఉత్పత్తి చేసే ప్రతి మందును వివిధ గది ఉష్టోగ్రతల వద్ద ఉంచి వాటి సామర్ఢ్యాన్నితరుచు పరీక్షిస్తుంటారు. ఉష్టోగ్రతలను ప్రయోగించి ఔషధం నాణ్యతలో మార్పులు తెలుసుకుంటారు. వీటిలో నాలుగు రకాల ఉష్ణోగ్రతలు ఉంటాయి.ఆ టెంపరెచర్‌లలో ఔషధాన్ని నిల్వ ఉంచి ఫలితాలు పరిశీలిస్తారు. దీని ద్వారా ఔషధం ఏ టెంపరెచర్‌లో దెబ్బతింటుందో్ తెలుసుకుంటారు. దీనిని బట్టి ఆ మందు నాణ్యత ఎన్ని రోజుల వరకు దెబ్బతినకుండా ఉంటుందో అంచనా వేస్తారు. ఈ పరీక్షల అనంతరం ఔషధానికి ఉన్న ఎక్స్‌పైరీ తేదీని నిర్ణయిస్తారు. మందుల్లో వ్యాధి చికిత్సకు ఉపయోగపడే సమ్మేళన పదార్ధాం కొంద గాఢతతో ఉంటుంది. ఎక్స్‌ఫైరీ తేదీ దాటితే గాఢత తగ్గిపోతుంది.ఔషదాల్లో ఉపయోగించేది రసాయనం కనుక వివిధ చర్యల అనంతరం హానికరమైనిదిగా మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇది ప్రాణాలకే ముప్పు. ఏ పదార్థానైన ఎక్స్‌పైరీ తేదీ దాటిన తర్వాత వాడకూడదు. కాలపరిమితి తేదీ లేని వాటిని ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మనం వాడే నిత్యవసర సరుకులపై కంపెనీ యజమానులు మ్యాన్యూఫాక్చరింగ్, ఎక్స్‌ఫైరీ డేట్ ముద్రించడం లేదు. బ్యూటీ ప్రొడక్ట్, వాటర్, మిల్క్ ప్యాకెట్స్ లాంటి వాటిపై సరైన ఎక్స్‌ఫైరీ డేట్‌ను ముద్రించకపోవడం,వాటిని వినియోగదారులు ఉపయోగించడంతో అవి ఆరోగ్యానికి హానిచేస్తున్నాయి.