DailyDose

అవనిగడ్డలో వైద్యుని దారుణ హత్య-నేరవార్తలు

అవనిగడ్డలో వైద్యుని దారుణ హత్య-నేరవార్తలుDoctor Murdered In Avanigadda - Telugu Crime News

* అవనిగడ్డలో ప్రముఖ వైద్యులు డా.కోట శ్రీహరిరావు(65) మృతి…ఆయన గృహంలో బెడ్ రూమ్ లో రక్తపు మడుగులో ఉన్న మృతదేహం…సీసీటీవీ కెమెరాలలో సైతం కనిపించకుండా పైకి తిప్పిన వైనం…హత్య అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు…కుటుంబ సభ్యులు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒక్కరే ఉన్న డాక్టర్.

* ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు.

* సచివాలయం, నవంబర్ 28 : ఈ నెల 30 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు జరగనున్న దృష్ట్యా కొవిడ్ నిబంధనలకు లోబడి కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టాలని శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ఆదేశించారు.అసెంబ్లీ స్సీకర్ తమ్మినేని సీతారాంతో కలిసి పోలీసు ఉన్నతాధికారులతో అసెంబ్లీలో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు.

* ప్రేమించి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నాక పెళ్ళెన 7సంవత్సరాల తర్వాత మొహం చాటేయడంతో అమరావతి కి చెందిన మహిళ భాగ్యరేఖ కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామం లోని అత్త వారింటి వద్ద నిరసనకు దిగింది.దీంతో అత్త మామలు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు.ఇద్దరు పిల్లలతో దిక్కు తోచని స్థితిలో ఆ మహిళ ఇబ్రహీంపట్నం పోలీసులను అశ్రయించింది.కట్నం కోసం వత్తిడి చేస్తూ,కులం వంకతో తనను ఇబ్బందులు పెడుతున్నారని,తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది మహిళ.తన మామ కూడా గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని,తన భర్తకు బుద్ది చెప్పి తనకూ తన పిల్లలకూ న్యాయం చేయాలని కోరుతుంది మహిళ.ఇంటికి తాళం వేసి అత్త మామలు వెళ్ళిపోవడం తో అదే ఇంటి వద్ద బయటే కూర్చుని ఏం చేయాలో పాలుపోని స్థితిలో బిక్కుబిక్కుమంటుంది భాగ్యరేఖ.

* విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్.కరోనా పరిస్థితుల దృష్ట్యా కొన్ని నెలలుగా ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిలిపివేశారు.తనిఖీలు చేయకపోవటంతో మందుబాబులు యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు వినియోగించే బ్రీత్ ఎనలైజర్ పరికరంలో నోటితో ఊదాల్సి ఉంటుందని విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ సర్కార్ తెలిపారు.నోటి తుంపరుల వల్ల కొవిడ్ వ్యాప్తి జరిగే అవకాశముందని చెప్పారు.కరోనా జాగ్రత్తల్లో భాగంగానే తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేశామన్నారు.రక్త పరీక్ష చేయటం ద్వారా ఆల్కహాల్ శాతం తెలుసుకోవచ్చని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

* బండి సంజయ్ ఫై కేసు నమోదు.ఐపీఎస్ 505 కింద కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలిసులు.అక్బరుద్దీన్ ఫై కూడా కేసు నమోదు.ఎర్రగడ్డ డివిజన్ ప్రచారం లో భాగం గా అనుచిత వాక్యలు చేసిన బండి సంజయ్.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు సుమోటో కింద కేసు నమోదు చేసిన పోలీస్ శాఖ.పీవీ , ఎన్ఠీఆర్ ఘాట్ కూల్చివేతల వాఖ్యల ఫై అక్బర్ ఫై కేసు నమోదు.దారుసాలం కూల్చివేత వాఖ్యల ల ఫై బండి సంజయ్ ఫై కేసు నమోదు.