Politics

ఒక్క కేసీఆర్ కోసం ఇంత మంది ఎందుకు?-GHMC-TNI బులెటిన్

KCR At LB Stadium Speaks Against BJP Leaders Campaign

* ఎన్నికల చాలా జరుగుతూ ఉంటాయి, ఎన్నికల సందర్భాలు వస్తూ ఉంటాయి.ప్రజలు ఓట్లు వేసే ముందు ఆలోచన చేయాలి.ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలు ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆలోచన చేయాలి ఎందుకంటే మంచి పనులు చేసినప్పుడు ఇంకా ముందు కు పోవాల్సిన అవసరం ఉంది.మన హైదరాబాద్ నగరం చాలా చరిత్ర ఉన్న నగరం.నేను చెప్పేవి అన్ని సాక్షి భూతం ఉన్నటివంటి ముచ్చట్లు.తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అంధకారం అవుతుంది అని కొంత మంది మీకు పాలన రాదు అని కొంత మంది మరికొంత నక్సలైట్లు వస్తారు అని అన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నమ్ .తెలంగాణ వచ్చాక అవన్నీ పటాపంచలు అయ్యాయి తెలంగాణ రాష్ట్ర సమితి కి అధికారం కట్టబెట్టారు.తెలంగాణ లో కేసీఆర్ ప్రసంగాలు అంటే వేచి చూచేవారు .దేశంలో చరిత్రలో నిలిచే సభలు మనం పెట్టుకున్నమ్.6,7 యేండ్లు ఎంతో గంబిరంగా చేసి చూపించిందో మీ ముందు ఉంది .దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ చేసుకున్నాం.దేశం నలుమూలల నుండి వచ్చిన వారిని కడుపులో పెట్టుకొని కపడుకున్నాం.అందరిని అక్కున చేర్చుకున్నమ్,7 ఏండ్లలో కరెంట్ ఏ విధంగా ఉందో మీకు తెలుసు అందరి అంచనాల ను తలకిందులు అయింది .వెలుగుజీలుగుల హైదరాబాద్ కావాలని 6 నెలల్లో అది అదిరోహించాం.ఎవరి ఇంటికి వెళ్లిన పెట్రోల్ ,డీజిల్ వాసన ఎక్కడకుపోయిన కరెంట్ కట్ కానీ 7 ఎండ్లలో ఎక్కడ కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా చేశాము.దేశంలోనే ఎక్కువ కరెంట్ వినియోగం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను దీన్ని గర్వంగా చెప్తున్న.కాలనీ లలో ఎక్కడ నీళ్లు కొట్లాటలు లేవు ,బిందెలు లతో కొట్లాటలు అయ్యేయి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.24 గంటల మంచి నీటి సరఫరా చేస్తాం .ఇప్పటికే దీనిపై కమిటీ వేశాం .నగర ప్రజలకు ఇప్పటికే వరం ఇవ్వడం జరిగింది నేను బంజారాహిల్స్ లో ఉన్నప్పుడు మైక్ లు పెట్టుకొని నల్ల బిల్లు కట్టాలని కోరే వారు అప్పుడు నేను ఉద్యమం లో ఉంన్నాను తెలంగాణ వస్తే త్రాగు నీరు ఉచితంగా ఇవ్వాలని చెప్పాను .రాష్ట్రంలో ఇప్పటికే ప్రాజెక్ట్ పూర్తి అయ్యాయి .అపార్ట్మెంట్ లలో ఉన్న వాళ్లకు కూడా 20 వేల నీటి పథకం అందజేస్తాంపల్లె ప్రగతి దేశంలో ఎక్కడ లేదు దీనితో అద్భుతమైన ప్రగతి సాధించింది.కేసీఆర్ కిట్ సూపర్ హిట్ .రైతు బంధు దేశంలో ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో ఉన్న రైతు ప్రతి ఒక్కరికి ఇస్తున్ననని మనవి చేస్తున్న.రైతు చనిపోతే రైతు భీమా ఎక్కడైనా ఉందా కేవలం5 రోజుల్లో వారికి 5 లక్షలు అందజేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.బస్తి దవాఖాన లు ఎక్కడ అయిన ఉన్నాయా…హైదరాబాద్ నగరంలో ఉంది.ప్రతి కుల వృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం.రజకులను ఆదుకోవాలని కోరారు అందుకే ఈ మధ్యనే ధోభీ ఘాట్ లలో ఉచిత కరెంట్ అందిస్తుంది.గొల్ల కూర్మలకు గొఱ్ఱెలను అందిస్తున్నాం ఇంకా కొంత మందికి రావాలి కచ్చితంగా ఇస్తాం.నాయి బ్రాహ్మణులకు కమర్షియల్ నుండి డొమెస్టిక్ కావాలని కోరారు వారికి కూడా ఉచితంగానే విద్యుత్ అందిస్తున్నాం.కరోనా వచ్చిన ఎక్కడ కూడా సంక్షేమం ఆగలేదు కరోనా కాలంలో ఇంకా ఎక్కువనే బియ్యం పంపిణీ చేశాము.నగరం ఆశస్త్రీయంగా పెరిగింది ఇది ఎవరి వలన అని నేను నిందించనుఁ ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒక్కరే కాదు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అనేక సంస్కరణలు చేశాము ఇంకా చేసుకోవాలి.హైదరాబాద్ నగరం వరదల్లో ఇబ్బందులు పడుతుంది దానికి శాశ్వత పరిష్కారం కావాలి అంటే 10 కోట్లు కావాలి .హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ వెహికిల్ లకు రాయితీలు ఇచ్చము.హైదరాబాద్ నగరంలో పచ్చదనం పెరగాలి దానికోసమే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్తున్న.మూసి నది ఆగం అయింది దాన్ని సుందరికరణ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది చేసి తిరుతాం.హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే మా మంత్రులు ఎమ్మెల్యే లు మోకాళ్ళ నీళ్ల లోతు లో తిరిగారు .వాళ్ళను చూస్తే దుఃఖం వచ్చింది నాకు దరఖాస్తులు పెట్టుకోలేదు ఎవరు అడగలేదు కానీ దసరా పండుగ ఉందని 6లక్షల 50 వేల మందికి ఇచ్చము. కొంత మంది కొడుకులు అడ్డుకున్నారు కానీ ఎన్నికలు ముగిశాక ఎవరు అర్హులైన వారికి ఇస్తాం ఇచ్చి తిరుతాం.భాద ఏంది అంటే వాన వలన మేము నష్టపోయాం ప్రధాన మంత్రి ని 1350 కోట్లు ఇవ్వమని అడిగం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎందుకు ఈ వివక్షగి మున్సిపల్ ఎన్నికల కు గింత మందిన ఎందుకు ఇక్కడ ఎం ఎన్నికలు జరుగుతున్నాయి నేషినల్ ఎన్నికల వరద లాగా వస్తున్నారు ఒక్క బక్క కేసీఆర్ డికొండం కోసం ఇంత మందినా.రెండు జాతీయ పార్టీ ల తీరు బాగాలేదు ఎందుకంటే వాళ్ళు చేసేవి బాగా లేవు అన్నందుకే ఇంత తండ్లాట నన్ను ఇక్కడే అడ్డుకోవాలని చూస్తున్నారు కానీ ఎవడి వలన కాదు నన్ను అన్నోళ్లు ఒక్కడు కూడా అడ్రెస్ లేకుండా పోయారు.

* జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం ‌ఎల్బీ స్టేడియం లో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు నగరం ‌నలుమూలల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు‌. సీఎం కేసీఆర్ గారు హాజరు కానున్న ఈ సభకు హాజరయ్యేందుకు, బస్సులో బయల్దేరారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ బస్సు లో సభా ప్రాంగణానికి వెళ్తున్నారు.

* హైదరాబాద్‌ మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా బిడ్డలేనని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పరిణతి సాధించిందని పేర్కొన్నారు.’హైదరాబాద్‌ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? అనే చర్చ ప్రజల్లో జరగాలి. ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ఓటు వేసేముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. పార్టీలకు ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి. అప్పుడే మంచినేతలు రాజకీయాల్లో ఉంటారు. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసే ఓటు వేయాలి. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని’ సీఎం కోరారు.

* బండి సంజయ్ ఫై కేసు నమోదు.ఐపీఎస్ 505 కింద కేసు నమోదు చేసిన ఎస్ఆర్ నగర్ పోలిసులు.అక్బరుద్దీన్ ఫై కూడా కేసు నమోదు.ఎర్రగడ్డ డివిజన్ ప్రచారం లో భాగం గా అనుచిత వాక్యలు చేసిన బండి సంజయ్.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు సుమోటో కింద కేసు నమోదు చేసిన పోలీస్ శాఖ.పీవీ , ఎన్ఠీఆర్ ఘాట్ కూల్చివేతల వాఖ్యల ఫై అక్బర్ ఫై కేసు నమోదు.దారుసాలం కూల్చివేత వాఖ్యల ల ఫై బండి సంజయ్ ఫై కేసు నమోదు.