Devotional

కార్తిక పౌర్ణమి నాడు 365 దీపాలు ఎందుకు?

కార్తిక పౌర్ణమి నాడు 365 దీపాలు ఎందుకు?

కార్తిక పౌర్ణమి రోజున ప్రతి వాళ్ళూ తమ ఇళ్ళలో దీపం పెట్టుకుంటారు. ఆ రోజు గుత్తి దీపాలు కూడా పెడతారు. దీనికి కారణాలు రెండు. ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఒక్క రోజూ ఉండకూడదు. మనం కట్టుకున్న ఇంటికి తాళం పెట్టి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఇంటి పురోహితుణ్ణి పిలిచి- ‘‘మా పూజామందిరంలో దీపం వెలిగించి, స్వామికి నైవేద్యం పెట్టండి’’ అని చెప్పి. ఇంటి తాళం ఇచ్చి వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది.ఇంట దీపం వెలగలేదు అంటే అది పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. ‘స్వగృహే’ అని ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్పుకుంటామో అక్కడ అన్ని చోట్లా దీపం వెలగాలి. మనకు అలా దీపం వెలగకపోతే దోషం మనకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా లభించిన అద్భుతమైన తిథి కార్తిక పౌర్ణమి. అందుకే కార్తిక పౌర్ణమి నాడు 365 వత్తులను ‘గుత్తిదీపం’ అని ఆవునేతిలో ముంచి వెలిగిస్తారు. పది రోజులో, పదిహేను రోజులో, అంతకుముందెప్పుడో తప్పు చేసిన రోజులు ఎన్ని ఉన్నాయో… ఈ ఏడాదంతా దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో… అదంతా పోవాలని ఆ 365 దీపాలు వెలిగిస్తారు.