DailyDose

తాడేపల్లిలో చిన్నారిపై అత్యాచారం-నేరవార్తలు

తాడేపల్లిలో చిన్నారిపై అత్యాచారం-నేరవార్తలు

* ఉండవల్లి సెంటర్ లో సాయరాం ప్రియ అపార్ట్ మెంట్లో మైనర్ బాలిక ( 5y) పై అత్యాచారంఅత్యా చారానికి పాల్పడిన వ్యక్తి అపార్ట్ మెంటులో నివాసం ఉండే రైల్వే ఎంప్లాయి తిలక్ తమ్ముడు శ్రీనివాస్ 55 కావడంతో పరువు పోతుందని రాత్రంతా పైరవీలు చేసిన వైనంఅపార్ట్ మెంట్ పరువు పోకుండా విషయం దాచిన అపార్ట్ మెంట్ వాసులుబాదిత బాలిక అపార్ట్ మెంట్ వాచ్ మెన్ కూతురు కావడంతో వారిని మబ్య పెట్టి గుట్టు చప్పుడు కాకుండా ఊరికి పంపిన వైనంవిచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు.

* భారీగా సెల్ ఫోన్లు స్వాధీనం. విలువ నలభై లక్షలు. రాష్ట్రంలోనే ఇంత పెద్ద మొత్తంలో సెల్ఫోన్లు పట్టుబడడం ఇదే మొదటిసారి …. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ వెల్లడి.

* నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలోని గోవిందరాజుల కాలనీలోని మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడిన కారు, ఇద్దరు చిన్న పిల్లలకు స్వల్ప గాయాలు.

* బెంగుళూరులో ఎర్ర చందనం మాఫియా ముఠాలపై కడప ప్రత్యేక పోలీసు బృందాలు మెరుపు దాడులు చేశారు.పక్కా సమాచారంతో బెంగళూరు చేరుకున్న కడప పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలపై దాడులు నిర్వహించి ఇద్దరు బడా స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడ్డ బడా స్మగ్లర్లు కడప, మైదుకూరు, కోడూరులలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు సమాచారం.స్మగ్లర్లను పోలీసులు జిల్లాకు తీసుకురానున్నారు.

* గోపాలపట్నం లో కిడ్నాప్ కలకలం.ఆర్థిక లావాదేవీల కారణంగా తరుణ్ అనే వ్యక్తి సాగర్ నగర్ లో ముగ్గురిని కిడ్నాప్ చేసినట్లు సమాచారం.అందులో ఇద్దరు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించడంతో బయటకు పొక్కిన వైనం.స్థానిక లాడ్జి లో ఉంటున్న అమలాపురానికి చెందిన కిరణ్, రాజు ఎస్ కోట కు చెందిన జగదీశ్ లుగా గుర్తింపు.కిడ్నాప్ కు పాల్పడిన తరుణ్ అనే వ్యక్తిది కాకినాడ.