Politics

బండి సంజయ్ కారుపై తెరాస కార్యకర్తల దాడి

TRS Cadre Attacks Bandi Sanjay Car At Necklace Road

నగరంలోని నెక్లెస్‌రోడ్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక హోటల్‌కు వచ్చిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకున్నారు. ఆయనతో ఎక్కువ మంది ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేశారు. సంజయ్‌ కారును టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో బండి సంజయ్‌ను పోలీసులు వేరే కారులో  పంపారు.