Fashion

ఒత్తిడి మాయం చేసే ఆసనాలు

ఒత్తిడి మాయం చేసే ఆసనాలు

అధిక మానసిక ఒత్తిడి, హైపర్ టెన్షన్ మానవ శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. గుండెపోటు, గుండెనొప్పి వంటి ప్రమాదాలను తగ్గించుకోవాలంటే మనం రోజువారీ ఆహారంలో హైపర్ టెన్షన్ తగ్గించే ఆహారపదార్థాలను చేర్చుకోవాలి. అధిక రక్తపోటు, మైపర్‌టెన్షన్‌లు కొన్ని తీవ్రమైన పరిస్థితుల కారణంగా వస్తాయి. ముఖ్యంగా ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం, పిల్లలు పుట్టకుండా మాత్రలు మింగడం, నొప్పి తగ్గించే మాత్రలు, కిడ్నీ సమస్యలు, అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, అధిక ఒత్తిడిలకు గురికావలసిన వస్తుంది. హైపర్ టెన్షన్ వల్ల కిడ్నీ, జ్ఞాపకశక్తి, లైంగికత్వాలపై తీవ్రప్రభావం చూపిస్తుంది. ఆధునిక యుగంలో అధిక రక్తపోటు అనేది నిశ్శబ్ద కిల్లర్స్‌లో ఒకటిగా మారింది. కాబట్టి అధిక రక్తపోటు ఉంటే దానికి చెక్ పెట్టడానికి యోగ ఆసనాలను ప్రయత్నిస్తే మంచిది.
*పశ్చిమోత్తాసన
రక్తపోటుతో బాధపడుతున్నవారిలో ధమనులు అణచివేసే అవకాశాలు ఎక్కువ. ఇది క్రమంగా గుండెపోటు, గుండె నొప్పులకు దారితీస్తుంది. దీనికి మంచి పరిష్కారంగా పశ్చిమోత్తాసనం ఉంది. ఇది ధమనులను సౌకర్యవంతంగా ఉంచడం ద్వారా సహజంగానే రక్తపోటును తగ్గిస్తుంది.
*శవాసన
విశ్రాంతికోసం శవాసనం చాలా బాగా పనిచేస్తుంది. శవం ఆసనం రక్తపోటును తక్కువగా ఉంచటానికి అద్భుతంగా పనిచేస్తుంది. కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
*బాలాసన
రక్తపోటు కారణంగా తరచుగా ఆందోళన, కోపం వస్తూ ఉంటాయి. పిల్లల యొక్క భంగిమలో ఆందోళన అనవసరమైన అయోమయం తగ్గి మనస్సు ప్రశాంతతకు సహాయపడుతుంది. ఇది కూడా ఒత్తిడి ఉపశమనానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.
*ప్రాణాయామం
యోగ సాధనలో ప్రాణాయామం అనేది మెదడుకు ప్రశాంతతను కలిగించే గొప్ప మార్గం. అనులోమ, విలోమ ప్రాణాయామం ఆందోళన, హాని, గుండెరేటును సాధారణంగా ఉంచుతుంది. అధిక రక్తపోటును తగ్గించడం, రోగనిరోధక వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థలను తటస్థీకరిస్తుంది.
*అధోముఖ ఆసనం
అధోముఖ ఆసనం భంగిమ చాలా గొప్పది. ఇది ఒత్తిడి, ఉద్రిక్తత నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
*సేతుబంధం
ఈ సేతుబంధు ఆసనం వంతెన భంగిమలో ఉంటుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఉద్రిక్తతలను తగ్గిస్తూ చురుకుదనాలను పెంచుతుంది.
*సుఖాసనం
సుఖాసనం వంటి కూర్చునే భంగిమలు గుండెపై ఉన్న ఒత్తిడిని తగ్గించి రక్తపోటు చికిత్సలో సహాయపడతాయి. ఈ ఆసనం మనసు ఉధృతిని తగ్గించి శరీర విశ్రాంతికి ఉపయోగపడుతుంది.