NRI-NRT

సెయింట్ లూయిస్‌లో దీపావళి వేడుకలు

St Louis Diwali 2020 By TAS And NATS

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) సెయింట్ లూయిస్ తెలుగు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఎస్పీ బాలు పాటలను మనో బృందం అంతర్జాలంలో పాడి ఆహుతులను అలరించారు. ఈ సంగీత విభావరిలో ప్రముఖ గాయకులు పార్థసారథి, మల్లికార్జున, గాయనీ గోపికా పూర్ణిమా తదితరౌలు పాల్గొన్నారు. నాట్స్ మాజీ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్, స్థానిక ప్రతినిధులు డాక్టర్ సుధీర్ అట్లూరి, రమేశ్ బెల్లం, నాగ శిష్ట్లా, నాగ సతీష్ ముమ్మనగండి, వైఎస్ఆర్‌కె ప్రసాద్, కమలాకర్ జాగర్లమూడి, TAS అధ్యక్షుడు సురేంద్ర బాచిన తదితరులు పాల్గొన్నారు.