ScienceAndTech

అది 54ఏళ్ల కిందటి రాకెట్ శిథిలం

అది 54ఏళ్ల కిందటి రాకెట్ శిథిలం

భూ క‌క్ష్య‌లో ప‌రిభ్ర‌మిస్తున్న ఓ ర‌హ‌స్య వ‌స్తువుపై ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు క్లారిటీ ఇచ్చారు. భూగోళం చుట్టూ తిరుగుతున్న ఆ వ‌స్తువు గ్ర‌హ‌శ‌క‌లం కాదు అని, అది 54 ఏళ్ల క్రితం ప్ర‌యోగించిన అట్లాస్ సెంటార్ రాకెట్‌కు చెందిన శిథిల‌మ‌ని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు తేల్చారు. హ‌వాయిలో ఉన్న టెలిస్కోప్‌ ద్వారా ఆ రాకెట్ శిథిలాన్ని గుర్తించిన‌ట్లు కాలిఫోర్నియాలో ఉన్న నాసా జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబ్ ప‌రిశోధ‌కులు తెలిపారు. సెప్టెంబ‌ర్ నెల‌లో ఆ వ‌స్తువును గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లు.. తొలుత అది గ్ర‌హ‌శ‌క‌లం అనుకున్నారు. కానీ ఆస్ట‌రాయిడ్ నిపుణుడు పౌల్ చూడాస్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. భూ క‌క్ష్య‌లో తిరుగుతున్న ఆ వ‌స్తువు.. 1966లో చంద్రుడిపైకి ప్ర‌యోగించిన సెంటార్ రాకెట్‌కు చెందిన భాగ‌మ‌ని గుర్తించారు. అయితే ఆ రాకెట్ శిథిలం సైజు ప‌ది మీట‌ర్ల పొడువు, మూడు మీట‌ర్ల వెడ‌ల్పు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. యూనివ‌ర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో ప‌నిచేస్తున్న శాస్త్ర‌వేత్త విష్ణు రెడ్డి కూడా ఈ విష‌యాన్ని ద్రువీక‌రించారు. గ్ర‌హ‌శ‌క‌లంగా భావిస్తున్న ఆ వ‌స్తువు ప్ర‌స్తుతం 50 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ది. అయితే మార్చి నెల‌లో అది మ‌ల్లీ సూర్యుడి క‌క్ష‌లోకి వెళ్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. మ‌ళ్లీ 2036లో ఆ రాకెట్ భాగం భూక‌క్ష్య‌లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌న్నారు.