NRI-NRT

సోమవారం నాడు డాలస్‌లో భరత్ అంత్యక్రియలు

Bharat - Narasimha Reddy - Bharat - Narasimha Reddy - Lakshmi Cremation On Monday in Dallas

టెక్సాస్ సరిహద్దు నగరమైన లబ్బక్ సమీపాన శనివారం రాత్రి సంభవించిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణాకు చెందిన ప్రవాసులు భరత్ రెడ్డి, అతని తల్లిదండ్రులు నరసింహారెడ్డి, లక్ష్మీల అంత్యక్రియలు సోమవారం నాడు డాలస్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఈ ముగ్గురితో పాటు తీవ్రంగా గాయపడిన భరత్ సోదరి మౌనిక, మరో ఇద్దరు మిత్రులు మేఘన, సాయిప్రణీత్‌లకు లబ్బక్ యూనివర్శిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో మేఘన, సాయి పరిస్థితి నిలకడగా ఉండగా, మౌనికకు బుధవారం నాడు మెదడు చేసిన శస్త్రచికిత్స అనంతరం ఆమె వైద్యులు మాట్లాడుతూ ఆమె తదుపరి జీవనం క్లిష్టతరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

కాగా మౌనిక/భరత్‌ల పేరిట ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు GoFundmeలో నిధుల సేకరణ ప్రారంభించారు. గురువారం సాయంత్రం 9:30గంటల వరకు 7లక్షల48వేల డాలర్లు (₹5.5కోట్లు) సమీకరించారు. https://www.gofundme.com/f/help-mounika039s-family-loss-amp-medical-expenses

ఈ ప్రమాదంలో ప్రాథమిక సమాచారం మేరకు భరత్ అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు తెల్లని డివైడర్ గీతలు దాటి ఆవలి వైపు నుండి వస్తున్న మరొక వాహనాన్ని ఢీకొట్టిందని సమాచారం. పోలీసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో ఆవలి వైపు కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు హిస్పానిక్-అమెరికన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా వారి పేరిట నిధుల సమీకరణ చేపడుతున్నారు. https://www.gofundme.com/f/in-loving-memory-of-alex-crystal-and-baby-lucas

క్షతగాత్రులకు, మృతుల కుటుంబాలకు తానా చేయూతనందిస్తోంది.

సోమవారం నాడు డాలస్‌లో భరత్ అంత్యక్రియలు-Bharat - Narasimha Reddy - Lakshmi Cremation On Monday in Dallas