DailyDose

క్లాస్‌రూంలో పెళ్లి చేసుకున్న మైనర్ ప్రేమికులు-నేరవార్తలు

Btech Classmates Marry In Classroom - Telugu Crime News

* క్లాస్ రూమ్‎లో పెళ్లి చేసుకున్న టీనేజ్ ప్రేమికులు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెళ్లి కలకలం సృష్టించింది.కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్‎లోనే పెళ్లి చేసుకున్నారు మైనర్లు.క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు అబ్బాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మైనర్లు వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి.దీంతో కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్‎గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి.విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చాడు.అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు.

* రెండు రోజులు పోలీసుల కస్టడీలోకి మంత్రి పేర్ని నానిపై దాడి చేసిన నిందితుడు బడుగు నాగేశ్వరరావు.కోర్టు అనుమతితో మచిలీపట్నం సబ్ జైలు నుండి కస్టడీలోకి తీసుకున్న చిలకలపూడి సీఐ వెంకట నారాయణ.నిందితుడిని మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలింపు.భారీ బందోబస్తు మధ్య నిందితుడిని తరలించిన పోలీసులు.ఇప్పటికే ఈ కేసులో పలువురు టీడీపీ ముఖ్య నేతలను విచారించిన పోలీసులు.మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విచారించనున్న పోలీసులు.ఇసుక లేక అక్కస్సుతో దాడి చేసి ఉండొచ్చంటూ ఘటన జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర.ఇదే విషయమై ఏ ఆధారంతో మాట్లాడారనే దానిపై రవీంద్రను విచారించే అవకాశం.

* అవినీతి ఎస్సై పై సస్పెన్షన్ వేటు.నెల్లూరు జిల్లా కొడవలూరు ఎస్సై జిలానీపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.నేలమాముళ్లు తీసుకుని పోలీసు శాఖ పరువును నడిరోడ్డు లో పెట్టి అంతరాష్ట్ర పేకాటకు సహకారం అందించడంపై జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు.ఇంటి దొంగల పని పెట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.పోలీసు శాఖకు తలవంపులు తెస్తూ కలుపుమొక్కగా మారిన జిలానిపై అలాగే యస్బి ఎస్సై మరో ఇద్దరు కానిస్టేబుల్ లపై విఅర్ వేటు పడింది.తాజాగా కొడవలూరు ఎస్సై జిలాని ,ఎస్బి ఎస్సై వెంకట సాయి ,మరో ఇద్దరు కానిస్టేబుల్ లపై సస్పెన్షన్ వేటు పడింది.కోవూరు సీఐ రామారావు ని విఆర్కి బదిలీ చేశారు.