Politics

ఛత్తీస్‌ఘడ్‌లో పురంధేశ్వరికి ఘనస్వాగతం

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరికి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఇంఛార్జ్‌గా ఆ పార్టీ అధిష్టానం ఆమెను ఇటీవల నియమించింది. ఈ సందర్భంగా పురంధేశ్వరి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి వెళ్లారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల ఇంఛార్జులతో పాటు పార్టీ సీనియర్ నేతలతో ఆమె భేటీ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. అంతకుముందు పురంధేశ్వరిని సన్మానించారు.