NRI-NRT

అబుదాబిలోని భారతీయులకు ముఖ్య గమనిక

Abu Dhabi Indian News - Passport Renewal Rules

భారతీయ పాస్‌పోర్టుల రెన్యూవల్‌కు సంబంధించి అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ కొత్త రూల్ తీసుకువచ్చింది. గడువు ముగిసిన లేదా జనవరి 31తో గడువు ముగియనున్న పాస్‌పోర్టులను మొదట రెన్యూవల్ చేయనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచే ఈ కొత్త రూల్ అమలులోకి రాగా….తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ విధానమే అమలులో ఉంటుందని భారత మిషన్ అధికారులు పేర్కొన్నారు. కోవిడ్-19 వ్యాప్తిని నివారించే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఎమర్జెన్సీ పాస్‌పోర్ట్ సర్వీసుల కోసం దరఖాస్తుదారులు తమ ధృవపత్రాలను స్కాన్ చేసి cons.abudhabi@mea.gov.inకు మెయిల్ చేయాలని అధికారులు తెలిపారు. అలాగే ఎమర్జెన్సీ వివరాలను కూడా మెయిల్‌లో వివరించాలన్నారు. అటువంటి అన్ని ఈ-మెయిల్స్‌కు రాయబార కార్యాలయం స్పందించి అవసరమైన కాన్సులర్ సేవలను అందిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.