Movies

మరోసారి పోలీస్‌గా సల్మాన్

సిక్కు పోలీసు లుక్‌లో స‌ల్మాన్ ఖాన్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాడు. కొత్త సినిమా అంతిమ్ కోసం స‌ల్మాన్ ఆ లుక్‌లో అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ కొత్త లుక్‌ను ఆయ‌న బామ్మ‌ర్ది ఆయుష్ శ‌ర్మ రిలీజ్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయ‌న ఓ వీడియోను పోస్టు చేశాడు. అంతిమ్ సెట్స్‌లో తీసిన ఆ వీడియోలో స‌ల్మాన్ తెగ స్ట‌యిలిష్‌గా క‌నిపిస్తున్నాడు. ట‌ర్బ‌న్ చుట్టుకున్న స‌ల్మాన్‌.. ఓ కూర‌గాయ‌ల మార్కెట్‌లోకి న‌డుచుకుంటూ వెళ్తున్న సీన్‌ను ఆ వీడియోలో చూపించారు. అంతిమ్ షూటింగ్ ప్రారంభ‌మైన‌ట్లు ఆయుష్ త‌న ట్వీట్‌లో తెలిపారు. గ్యాంగ్ వార్‌, ల్యాండ్ మాఫియాల‌ను అంతం చేసేందుకు స‌ల్మాన్ ఓ పోలీసు పాత్ర‌లో న‌టిస్తున్నాడు. న‌వంబ‌ర్ 16వ తేదీనే ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది. మ‌హేశ్ మంజ్రేక‌ర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌ను నికిటిన్ దీర్ పోషిస్తున్నాడు.