Business

“అమెజాన్ పే”ను ఆదరించని భారతీయులు

“అమెజాన్ పే”ను ఆదరించని భారతీయులు

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు చెందిన చెల్లింపుల విభాగం అమెజాన్‌ పే (ఇండియా) గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.1,868.5 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2018-19లో లో సంస్థ నష్టం రూ.1,160.8 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.834.5 కోట్ల నుంచి 64 శాతానికి పైగా పెరిగి రూ.1,370 కోట్లకు చేరింది. పేటీఎం, ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి సంస్థలతో పోటీపడుతున్న అమెజాన్‌ పేలోకి గత ఆర్థిక సంవత్సరం అమెజాన్‌ కార్పొరేట్‌ హోల్డింగ్స్‌, అమెజాన్‌ డాట్‌ కామ్‌ల నుంచి రూ.2,700 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ సంస్థలకు అమెజాన్‌ పే జూన్‌లో రూ.450 కోట్లు, అక్టోబరులో రూ.900 కోట్లు, 2019 డిసెంబరులో రూ.1355 కోట్ల మేర షేర్లను కేటాయించింది. ఈ ఏడాది సెప్టెంబరులో మరో రూ.700 కోట్ల విలువైన షేర్లు జారీ చేసింది.