Politics

రుణాలు సరిగ్గా ఇవ్వట్లేదు

రుణాలు సరిగ్గా ఇవ్వట్లేదు

కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సీఎం జగన్‌ కోరారు. ప్రస్తుతం బ్యాంకులిచ్చే రుణాలు అంత ఆశాజనకంగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 213వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పలు బ్యాంకుల ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పెట్టుబడి వ్యయం తగ్గాలని.. పంటలకు మార్కెట్‌ వసతులు రావాలన్నారు. విపత్తులు వచ్చినపుడు రైతులను ఆదుకోవాలని జగన్‌ కోరారు. జగనన్న తోడు కింద చిరువ్యాపారులకు రూ.10వేల వడ్డీ లేని రుణం ఇస్తున్నామని.. వారికి బ్యాంకర్లు అండగా నిలవాలన్నారు. మహిళలు సకాలంలో కట్టే రుణాలపై ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోందని గుర్తు చేశారు. ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకులు అండగా నిలవాలని.. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని బ్యాంకర్లను సీఎం కోరారు.