NRI-NRT

తెలంగాణా విద్యార్థినికి తానా కార్యదర్శి ఉపకారవేతనం

TANA Secretary Ravi Potluri Helps Poor Student In Telangana

కరోనా వైరస్ వలన తల్లితండ్రులు ఉపాధి కోల్పోయి విద్యార్థులు ఆర్ధిక ఇబ్బందులు పడుతుండటంతో గత కొన్ని నెలలుగా తానా కార్యదర్శి పొట్లూరి రవి తన సొంత నిధులతో, మిత్రుల ద్వారా గత మూడు నెలలలో దాదాపు వంద మంది విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో పాలిటెక్నిక్ మూడవ సంవత్సరం చదువుతున్న శ్రీ చరణ్ కు, ఎనిమదవ తరగతి చదువుతున్న వైష్ణవికు వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్మన్ కరుణ వైస్ చైర్మన్ సుజాత చేతులమీదుగా 25,000రూపాయల ఉపకారవేతనం అందించారు. అన్ని దానాలలో విద్యాదానం గొప్పదని ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన రవి పొట్లూరి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూరి, హోటల్ విజయ్, శాంతినగర్ సేవ సమితి అస్లాం తదితరులు పాల్గొన్నారు.