* ఐడీఏ బొల్లారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పేలుడు కారణంగా కంపెనీలో భారీ శబ్ధంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో భయాందోళనలకు గురైన కార్మికులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు కిందపడి గాయాలపాలయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.కంపెనీ మొత్తం రసాయనాలతో నిండిపోయింది.అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 120 మంది ఉన్నట్లు సమాచారం.
* అప్పుల బాధతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేశారు.కుటుంబసభ్యులు వారిని ఆస్పత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఆర్ అండ్ బీ విభాగంలో టెక్నికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రామాంజనేయులు స్థానికంగా ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.
* ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లికి చెందిన పెంకు వెంకన్న అనే 70 ఏళ్ల వ్యక్తి గంగిరెద్దులు తిప్పుతూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి రెండు గంగిరెద్దులు ఉన్నాయి. ధూమపానం అతణ్ని నిలువునా సజీవంగా కాల్చేసింది. అలవాటు ప్రకారం మంచంపై పడుకుని చుట్ట తాగుతూ ఆ వ్యక్తి నిద్రలోకి జారుకోగా.. ఆ చుట్ట అతడి నోట్లో నుంచి కింద పడిపోయి మంచం కింద ఉన్న గడ్డికి అంటుకోవడంతో సజీవదహనం అయిపోయాడు.
* నాట్లు వేస్తూ అస్వస్థతకు గురైన ఆరుగురు కూలీలు…ఒకరు మృతి.నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెలుగొట్లపల్లిలో వ్యవసాయ కూలీలు అస్వస్థతకు గురయ్యారు.నాట్లు వేస్తూ ఆరుగురు కూలీలు హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.ఆ ఆరుగురు కూలీల్లో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులను పొదలకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
* అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్న వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతి.వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతి భర్త రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.దాచేపల్లిలో హైవే మీద ఆందోళన చేశాడంటూ రాజేష్‌పై కేసు నమోదు అయ్యింది.దాచేపల్లి క్వారీ ఘర్షణలో బాధితులకు న్యాయం చేయాలంటూ రాజేష్ ఆందోళనకు దిగినట్లు తెలుస్తోంది.కేసు నమోదు అవడంతో రేవతి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
* గుంటూరు బ్లాసమ్స్ చిల్డ్రన్ హాస్పిటల్ లో దారుణం.పిల్లవాడి వైద్యానికి 12 లక్షలు ఖర్చు చేయించిన వైనం.12 లక్షలు కట్టించుకుని మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించిన ఆసుపత్రి యాజమాన్యం.మా బిడ్డను చంపేసారంటూ తల్లిదండ్రులు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన.