Movies

శృతి జీవిత చరిత్ర పేరు “జ్వాలాముఖి”

శృతి జీవిత చరిత్ర పేరు “జ్వాలాముఖి”

సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంటూనే విరామ సమయాల్లో సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తోంది శృతిహాసన్‌. వ్యక్తిగత జీవితంతో పాటు కొత్త సినిమాల తాలూకు ముచ్చట్లను వారితో పంచుకుంటోంది. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సరదాగా సమాధానమిచ్చింది శృతిహాసన్‌. మీ జీవితమే ఓ సినిమా అనుకుంటే దానికి ఏమని టైటిల్‌ పెడతారని ఓ అభిమాని ప్రశ్నించగా ‘జ్వాలాముఖి’ అని పేరు పెడతానని సమాధానమిచ్చింది. ఎలాంటి సాధన లేకుండా నటనలో ప్రావీణ్యాన్ని సంపాదించుకోవడం తన అదృష్టమని చెప్పింది. స్వతహాగా అబ్బిన కళను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటానని పేర్కొంది. పౌరాణిక పాత్రల్లో నటించాలనుందని, అలాంటి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ‘బ్యాట్‌మన్‌’ సినిమా విలన్‌ తాలియాకు తాను వీరాభిమానినని, అలాంటి ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో ఒక్కసారైనా కనిపించాలనుందని శృతిహాసన్‌ తెలిపింది. ప్రస్తుతం తెలుగులో ‘క్రాక్‌’ సినిమాలో కథానాయికగా నటిస్తోంది శృతిహాసన్‌.