Movies

నెదర్ల్యాండ్స్ పుష్పానికి ఐశ్వర్య పేరు

నెదర్ల్యాండ్స్ పుష్పానికి ఐశ్వర్య పేరు

ఓ దేశంలోని పుష్పాలకు భారత స్టార్​ హీరోయిన్​ పేరు పెట్టి ఆమెను గౌరవించింది అక్కడి ప్రభుత్వం. ఇంతకీ ఆ దేశం ఏమిటి? ఎవరా హీరోయిన్ తెలుసా?అందమైన అమ్మాయిలను గులాబీలు, సన్నజాజుల్లాంటి పూలతో పోల్చడం తెలిసిందే. కానీ అందమైన పూలను ఓ అమ్మాయితో పోలుస్తూ వాటికి ఆమె పేరే పెట్టడం ఎప్పుడైనా విన్నారా? నెదర్లాండ్స్​లో ఇదే తంతు జరిగింది.ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. అద్భుత సౌందర్యంతో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకుని ఆ తర్వాత బాలీవుడ్‌ అగ్ర కథానాయికగా అలరిస్తున్న ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌. ఆమె తన అందంతో సరిహద్దులు చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. దీనికి ప్రతీకగా నెదర్లాండ్స్​లో తులిప్‌ పుష్పాలకు ఐశ్వర్య‌ పేరు పెట్టారు. 2005లో ఆ దేశ ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయం తీసుకొని ఐశ్వర్యను గౌరవించింది.