Business

చెట్టినాడ్ పిచ్చి చేష్ఠలు-₹700కోట్ల బకాయిలు

చెట్టినాడు గ్రూపు సంస్థల కార్యాలయాల్లో ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను అధికారుల సోదాల్లో లభించిన కీలకపత్రాల ఆధారంగా రూ.700 కోట్ల మేరకు పన్ను ఎగవేసినట్లు తెలిసింది. రూ.110 కోట్ల విదేశీ ఆస్తులు బయటపడ్డాయి. తమిళనాడు కేంద్రంగా చెట్టినాడు గ్రూపు సంస్థ సిమెంటు, విద్య, వైద్య, స్టీల్‌ ఉత్పత్తి, విద్యుదుత్పత్తి, రవాణా తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం ఈ గ్రూపు సంస్థలకు చెందిన చెన్నై, కోయంబత్తూర్‌, తిరుచ్చి జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లోని కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు.