Sports

ఫార్ములా వన్ 2020 విజేత ఇతడే!

ఫార్ములా వన్ 2020 విజేత ఇతడే!

ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2020–సీజన్‌ ముగింపు రేసులో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు. యాస్‌ మరీనా సర్క్యూట్‌లో ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 55 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్‌ అందరికంటే ముందుగా గంటా 36 నిమిషాల 28.645 సెకన్లలో ముగించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన 23 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఏదశలోనూ ఇతర డ్రైవర్ల నుంచి పోటీ ఎదురుకాలేదు. మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్లు బొటాస్‌ రెండో స్థానంలో… హామిల్టన్‌ మూడో స్థానంలో నిలిచారు.