Health

మీ ఆరోగ్యాన్ని మింగేస్తున్న మీ ఫోను

Smartphones causing huge health problems

మీరు ప్రతి రోజు స్మార్ట్‌ఫోన్‌లపైనే ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే జాగ్రత్త దాదాపు నాలుగింట ఒక వంతు యువకులు తమ స్మార్ట్‌ఫోన్‌లపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల అది ఒక వ్యసనంలాగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని మానసిక వైద్యుల పరిశోధనలు సూచిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లను రోజువారీగా ఎక్కువ ఉపయోగించడం ద్వారా మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల వచ్చిన ఒక నివేదిక ప్రకారం యువకులు ఫోన్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల వారు ఫోన్ పై నియంత్రణను కోల్పోతున్నట్లు తెలుస్తుంది.

బీఎంసీ సైకియాట్రీలో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడటం వల్ల కలిగే పరిణామాలను తెలుసుకోవడం కోసం దర్యాప్తులో భాగంగా 42,000 మంది యువకుల  మీద 
పరిశోధనలను జరిపినట్లు తెలిపారు. ఇందులో 23 శాతం మంది యువకుల మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నారు. వారు ఫోన్‌ను ఉపయోగించలేకుండా ఉండలేక పోవడం, సమయం విషయంలో నియంత్రణను కోల్పోవడం వంటి విషయాలను గమనించినట్లు తెలిపారు.

మొబైల్ ని ఎక్కువగా వాడటం వల్ల ఒత్తిడికి గురిఅవ్వడం, మానసిక స్థితి సరిగా లేకపోవడం, వృత్తిపరమైన లక్ష్యాలను సాధించ లేకపోవడం, కుటుంబాన్ని, బంధువులను పట్టించుకోకుండా ఏకాంతంగా ఉండటం చేస్తున్నట్లు తెలిపారు. ఎవరినీ పట్టించుకోకుండా స్వార్థంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా నెగెటివ్ ఆలోచనలు భాగా పేరుగుతునట్లు తెలుస్తుంది అని నిపుణులు తెలుపుతున్నారు.

మానసికంగా కుంగుబాటుకు గురిఅవుతూ ఆత్మహత్యలకు కూడా ప్రయత్నిస్తునట్లు నివేదికలో తేలాయి. వీటికి అన్నింటికీ మూలం స్మార్ట్ఫోన్ లేక వారు ఉపయోగించే యాప్స్ అనేది తెలియడం లేదు అని డాక్టర్ నికోలా కాల్క్ అన్నారు. అందుకోసమే పిల్లలు, యువకులు స్మార్ట్ఫోన్ వాడకం విషయంలో అవగాహన కల్పించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తమ ఫోన్లలో ఎంత సమయం గడుపుతారో తెలుసుకోవాలి లేకపోతె వారి మానసిక ఆరోగ్యం, రోజువారీ పనితీరుపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయి అని సహ రచయిత సమంతా సోహ్న్ హెచ్చరించారు.