Devotional

శ్రీవారి సుప్రభాత సేవ రద్దు

TTD News - Suprabhata Seva Cancelled Till Jan 14th

ఇవాళ్టి నుంచి జనవరి 14 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను రద్దు చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈనెల 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ ఏడాది 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను టీటీడీ తెరిచి ఉంచనుంది. 25న లక్ష వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.