NRI-NRT

లండన్‌ను భయపెడుతున్న మరో కొత్త వైరస్

LNV - London New Virus Scaring The British

లండన్ లో మరో కొత్త వైరస్

వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంక్షలు

మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుందేమోనన్న ఆందోళనలు

అలాంటి విపత్తేమీ లేదని చెబుతున్న శాస్త్రవేత్తలు.

హైదరాబాద్‌: కరోనా వైరస్‌లో జన్యుమార్పులు జరుగుతున్న కారణంగా లండన్‌లో కోవిడ్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని.. ఈ కారణంగా డిసెంబర్‌ 16 నుంచి కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నామని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ‘ఎన్‌501వై’అని పిలుస్తున్న ఈ కొత్త రకం వైరస్‌ ప్రమాదకరమా? జన్యుమార్పులు అన్నింటితోనూ చిక్కులేనా? అసలు మార్పులు ఎలా జరుగుతాయి? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు నిపుణులు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి..

డీఎన్‌ఏలో మార్పులు జరిగితే మానవులకు అపూర్వమైన శక్తులు వస్తాయని పలు హాలీవుడ్‌ సినిమాల్లో చూపిస్తుంటారు. అయితే వాస్తవంలో ఇలాంటిదేమీ ఉండదని మనకూ తెలుసు. నిజ జీవితంలో డీఎన్‌ఏలో మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. ఇంకోలా చెప్పాలంటే పరిణామక్రమంలో జన్యుమార్పులు అత్యంత సాధారణమైన విషయం. జన్యు మార్పులను అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రొటీన్ల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మన శరీరంలో ఐదో వంతు భాగం ప్రొటీన్లే. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఉపయోగపడే ఎంజైమ్‌లు మొదలుకొని మన చర్మం, వెంట్రుకల వరకూ అన్నీ ప్రొటీన్‌ రూపాలే. దాదాపు 20 అమైనో యాసిడ్స్‌తో తయారవుతాయి. ఈ అమైనో యాసిడ్స్‌లో అత్యధికం ఒకేలా ఉంటాయి.. కానీ అవి చేసే పనుల ఆధారంగా వీటిని చాలా వర్గాలుగా విభజించవచ్చు. ఈ అమైనో యాసిడ్స్‌ను వాడుకుని బోలెడన్ని కాంబినేషన్లలో ప్రొటీన్లను తయారు చేయొచ్చు. మొత్తమ్మీద మానవ శరీరంలో దాదాపు 60 లక్షల రకాల ప్రొటీన్లు ఉంటాయని లెక్క