NRI-NRT

సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ 2020-22 నూతన కార్యవర్గం

Singapore Telugu News - New EC For TCSS Singapore For 2020-22

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) ఏడవ వార్షిక సర్వ సభ్య సమావేశం ఈ నెల (డిసెంబర్) 20 వ తేదీన జూమ్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది సభ్యులు పాల్గొనడం జరిగింది. ప్రస్తుత అధ్యక్షుడు నీలం మహేందర్ గారిని, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాదించడంతో పాటు నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడం తో ప్రస్తుత కార్యవర్గం ఎన్నికకు ఎలాంటి పోటీ లేకుండా పోయింది. కావున ఎన్నికల అధికారులు నవీన్ ముద్రకోల్ల మరియు దోర్నాల చంద్ర శేఖర్ గార్లు నీలం మహేందర్ గారిని అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. తన పై నమ్మకంతో ఈ బాధ్యతను మరొక్కసారి అప్పగించి ఇక్కడి తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం ఇస్తుంన్నందుకు గాను అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన కార్యవర్గం సహకారం తో సొసైటీ ని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు మరియు ఎప్పుడు ఎంతో ఉత్సాహంగా సహాయ సహకారాలు అందిస్తున్న కార్య మరియు కార్య నిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. మొట్ట మొదటి ఆన్లైన్ సర్వసభ్య సమావేశం సాఫి గ జరగడానికి సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

నూతన కార్యవర్గం లో సొసైటీ అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సంస్థాగత కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, నల్ల భాస్కర్ గుప్త, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, బొడ్ల రోజారమణి, నంగునూరి వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు నడికట్ల భాస్కర్, గింజల సురేందర్ రెడ్డి, శ్రీధర్ కొల్లూరి, చకిలం ఫణిభూషణ్, గజ్జి రమాదేవి, నగమడ్ల దీప, ఆరూరి కవిత, వీరమల్లు కిరణ్ మరియు రంగ పట్నాల మరియు ఎన్నికోవడం జరిగింది. వీరితో పాటు కార్యనిర్వాహక వర్గం లో పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, పట్టూరి కిరణ్ కుమార్, రవి కృష్ణ విజాపూర్ మరియు కాసర్ల శ్రీనివాస్, గర్రేపల్లి కస్తూరి ఉన్నట్టు ప్రకటించారు.

సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ 2020-22 నూతన కార్యవర్గం