Politics

సీబీఐ కోర్టులో జగన్ కేసు విచారణ-తాజావార్తలు

Telugu News Roundup Today - CBI Court Hears Jagan Illegal Assets Case

* జగన్‌ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల ఛార్జ్‌షీట్‌లో విజయసాయిరెడ్డిపై ఏసీబీ చట్టం కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ వాదించింది. ఛార్జ్‌షీట్‌ దాఖలైన సమయంలో విజయసాయిరెడ్డి ప్రజాప్రతినిధి కానందున ఏసీబీ చట్టం వర్తించదని ఆయన తరఫు న్యాయవాది గతంలో వాదించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా మాత్రమే విధులు నిర్వర్తించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

* జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా అన్నారు. ప్రభుత్వం నిర్ణయిస్తే జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే చట్టాలకు కొన్ని సవరణలు అవసరం అని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణపై నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి లేదని చెప్పారు.

* పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర మంత్రి అమిత్‌ షా మాట్లాడినవన్నీ తప్పులేనని ఆ ఆరోపణలను రాష్ట్ర‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిప్పికొట్టారు. బెంగాల్‌ పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధిపై అమిత్‌ షా ఇచ్చిన గణాంకాలు అబద్దాల పుట్ట అని విరుచుకుపడ్డారు. హోంశాఖ మంత్రిగా ఉన్న మీకు సరైన వివరాలను నిర్ధారణ చేసుకోకుండా మీ పార్టీ నేతలు ఇచ్చిన అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని అమిత్‌షాకు సూచించారు. పరిశ్రమలు, రోడ్లపై ఆయన చేసిన ఆరోపణలు కూడా అసత్యమన్నారు. వీటికి సంబంధించి పశ్చిమ బెంగాల్‌ పనితీరుపై కేంద్ర ప్రభుత్వ నివేదికలే ఆధారమన్నారు. షా చేసిన అసత్య గణాంకాలపై పూర్తి వివరాలను మంగళవారం వెల్లడిస్తానని మమతా బెనర్జీ తెలిపారు.

* యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న తరుణంలో.. అటు కేంద్రంతో పాటు, మహారాష్ట్ర సర్కారు కూడా అప్రమత్తమైంది. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో ఈ కర్ఫ్యూను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘రాష్ట్ర రాజధాని ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ ఉంటుంది.

* కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి ఇటలీ వణకిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ విజృంభణ ఉన్నప్పటికీ కొవిడ్‌ కారణంగా ఎక్కువగా ఇటలీ వాసులే మృతి చెందుతున్నట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ప్రస్తుతం యూరప్‌లో రెండో దఫా కరోనా విజృంభణ కొనసాగుతోన్న సమయంలోనూ ఇటలీలోనే కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు సంభవిస్తోన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ దేశాలు ముందున్నాయి.

* విశాఖలో హవాలా నగదు కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన తనిఖీల్లో వేర్వేరు చోట్ల భారీగా నగదుతో పాటు గంజాయి, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రేమ్‌కాజల్‌ వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నగర పోలీసులు యాంటీ డ్రగ్‌ ప్రత్యేక డ్రైవ్‌లో నిర్వహించారు. ఈ తనిఖీల్లో 100 కిలోల గంజాయి, రూ.కోటి నగదు, 29.415కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

* స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చివేస్తానంటూ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

* ‘నన్ను దోచుకుందువటే’తో అందరి హృదయాలను దోచుకుంది. ‘ఇస్మార్ట్‌శంకర్‌’లో వరంగల్‌ పోరగాళ్లను.. అంటూ డైలాగ్‌ చెప్పి కుర్రకారును హోరెత్తించింది. ఈసారి పూర్తి భిన్నమైన పాత్రలో అమృతగా అలరించబోతోంది. తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ దూసుకెళుతోంది. ఇదంతా ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆమె ఇస్మార్ట్‌ భామ నభా నటేశ్‌. తాజాగా.. ఆమె నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె ముచ్చటించింది.

* కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రత్యేక కేబినెట్‌ సమావేశం ఏర్పాటు చేసి ఈ నిర్ణయం తీసుకుంది. తిరువనంతపురంలో ఈ సమావేశం జరిగింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు డిసెంబరు 23న ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు నిర్ణయించారు.

* కంకషన్‌కు గురైన సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా పురోగతిని టీమ్‌ఇండియా యాజమాన్యం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. బాక్సింగ్‌ డే టెస్టులోపు అతడు కోలుకుంటాడని ఆశిస్తోంది. ఒకవేళ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే హనుమవిహారి స్థానంలో జడ్డూనూ తీసుకోవడం ఖాయమే అని సమాచారం. ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచులో జడ్డూ తలకు బంతి తగిలింది. అంతేకాకుండా తొడ కండరాల గాయంతోనూ ఇబ్బంది పడ్డాడు. దాంతో ఆస్ట్రేలియాలో ఇన్నింగ్స్‌లో అతడు మైదానంలోకి రాలేదు. విశ్రాంతి తీసుకోవడంతో గులాబి సన్నాహక మ్యాచుల్లోనూ అతడు ఆడలేదు.

* వాహన తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, రెనో, హోండా కార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫోర్డ్‌ ఇండియా వంటి కార్ల తయారీ కంపెనీలతో పాటు ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్‌ సైతం ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించాయి. తాజాగా టాటా మోటార్స్‌, ఇసుజు, బీఎండబ్ల్యూ సైతం ధరలు పెంచుతున్నట్లు వెల్లడించాయి.

* రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటిస్తారని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సంవత్సరం చివరనే పుతిన్‌ భారత్‌ పర్యటన చేయాల్సి ఉండగా, కరోనా విజృంభణ నేపథ్యంలో అది వాయిదా పడినట్లు పేర్కొంది. ‘కరోనా మహమ్మారి నేపథ్యంలో నేరుగా కలవడం ఇబ్బందిగా మారింది. అయితే, ముఖాముఖీగా కలువలేకపోతున్నా.. భారత్‌-రష్యా మధ్య రాజకీయ, ఆర్థికపరమైన సంప్రదింపుల్లో ఎటువంటి లోటు లేదు. ఈ అక్టోబర్‌లోనే ఇరుదేశాల మధ్య సదస్సు జరగాల్సి ఉంది. కానీ, కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా సదస్సును వాయిదా వేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అయితే, వచ్చే ఏడాది తొలి ఆరునెలల్లోనే అధ్యక్షుడి పుతిన్‌ భారత్‌లో పర్యటిస్తారని ఆశిస్తున్నాం’ అని రష్యా రాయబారి నికోలయ్ కుదాషెవ్ వెల్లడించారు.

* యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ విజృంభిస్తున్న తరుణంలో.. అటు కేంద్రంతో పాటు, మహారాష్ట్ర సర్కారు కూడా అప్రమత్తమైంది. రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో ఈ కర్ఫ్యూను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘రాష్ట్ర రాజధాని ముంబయి సహా పలు ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ ఉంటుంది. ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు అమల్లో ఉంటుంది. ఈ పద్ధతి జనవరి 5 వరకు కొనసాగుతుంది. ఇతర యూరప్‌ దేశాల నుంచి వచ్చే వారు తప్పకుండా 14రోజుల క్వారంటైన్‌లో ఉండాలి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

* జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా అన్నారు. ప్రభుత్వం నిర్ణయిస్తే జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్ధమేనని చెప్పారు. ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే చట్టాలకు కొన్ని సవరణలు అవసరం అని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణపై నేరుగా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీకి లేదని చెప్పారు.

* కరోనా వైరస్‌ విషయంలో చైనాపై ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. మహమ్మారికి సంబంధించిన విషయాల్ని డ్రాగన్‌ తొలినాళ్లలో తొక్కిపెట్టిందని.. అందువల్లే వైరస్‌ విశృంఖలంగా వ్యాప్తి చెందిందని ఆరోపించాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక ఇదంతా నిజమేనని తేటతెల్లం చేసింది. వైరస్‌ వ్యాప్తి.. దాని పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి సమాచారం ఉండొద్దని చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకోసం కొంతమంది నిపుణులు, సంస్థలను నియమించి వారికి భారీ ఎత్తున చెల్లించినట్లు వెల్లడైంది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలను సంపాదించిన న్యూయార్క్‌ టైమ్స్‌, ప్రోపబ్లికా మీడియా సంస్థలు వాటిలోని సారాంశాన్ని ప్రచురించాయి.

* జగన్‌ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడుల ఛార్జ్‌షీట్‌లో విజయసాయిరెడ్డిపై ఏసీబీ చట్టం కింద అభియోగాలు వర్తిస్తాయని సీబీఐ వాదించింది. ఛార్జ్‌షీట్‌ దాఖలైన సమయంలో విజయసాయిరెడ్డి ప్రజాప్రతినిధి కానందున ఏసీబీ చట్టం వర్తించదని ఆయన తరఫు న్యాయవాది గతంలో వాదించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా మాత్రమే విధులు నిర్వర్తించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

* స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చివేస్తానంటూ మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కార్యక్రమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

* సాగు చట్టాల విషయంలో తెరాస ప్రభుత్వం తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఆరోపించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు తెరాస ఇటీవల మద్దతిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కాగా, రైతులకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనకు అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీలో నిరసన తెలపడానికి వెళ్తున్న తనను అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని హనుమంతరావు విమర్శించారు.