Business

నెలాఖరు నాటికి ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి-వాణిజ్యం

Business News - December 31st Is Last For Income Tax Returns

* డిసెంబరు 21 నాటికి దేశవ్యాప్తంగా 3.75కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేశారు. ఈ మేరకు ఐటీ విభాగం మంగళవారం వెల్లడించింది. మిగతావారు కూడా రిటర్నుల కోసం దాఖలు చేసుకోవాలంటూ ట్విటర్‌ వేదికగా సూచించింది.

* కరోనా కాలం ప్రారంభానికి ముందు నుంచే దేశీయ విమానయాన రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మహమ్మారి రాకతో అది మరింత ముదిరింది. ఒక రకంగా చెప్పాలంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లైంది. లాక్‌డౌన్‌ సమయంలో విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేయడంతో విమానయాన సంస్థలు తమ ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించని స్థితికి చేరాయి. క్రమంగా కరోనా చికిత్సకు కొన్ని ఔషధాలు, టీకా అందుబాటులోకి రావడంతో సర్వీసుల్ని పాక్షికంగా పునరుద్ధరించారు. అంతా సజావుగా సాగితే కొత్త సంవత్సరంలో పూర్తి స్థాయి విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని అంతా భావించారు.

* బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్‌ నేపథ్యంలో సోమవారం నాటి సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు.. మంగళవారం కోలుకున్నాయి. క్రితం సెషన్‌ భయాలతో ఈ ఉదయం హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకున్నాయి. ఐటీ సహా దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల అండతో లాభాల్లో స్థిరపడ్డాయి.

* 500 మంది గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలకు మద్దతు ఇచ్చేందుకు షీరోస్‌తో గూగుల్‌ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. వనరులు, మార్గదర్శకత్వం ఇవ్వడంతో పాటు నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించనుంది. గతేడాది దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సాధీ నెట్‌వర్క్‌ ద్వారా 10 మంది మహిళా వ్యాపారవేత్తలకు యాక్సెలరేటర్‌ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా గూగుల్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం, అమ్మకాలు, మార్కెటింగ్‌, డిజిటల్‌ వ్యవస్థల వినియోగం, నిర్వహణ, ఆత్మవిశ్వాసం వంటి అంశాల్లో మహిళా ఔత్సాహికులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తారు. ఇందులో పాల్గొన్న మహిళల విశ్వాసం మూడు నెలల్లోనే పెరిగిందని, నేర్చుకున్న విషయాలను వ్యాపారాల్లో అమలు చేయడం మొదలుపెట్టారని గూగుల్‌ ఇండియా తెలిపింది.

* ప్రయాణికుల సౌకర్యార్థం అద్దె కార్ల కంపెనీతో తాము జట్టు కట్టినట్లు ఇండిగో వెల్లడించింది. ప్రయాణికులు తమ విమానయాన వెబ్‌సైట్‌ నుంచి విమాన టికెట్‌తో పాటు ఈ కార్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. దేశంలోని 60 నగరాల్లో సొంతంగా నడిపే కార్లు లేదా అద్దెకు డ్రైవర్‌ సేవలు లభిస్తాయని పేర్కొంది. కార్లు బుక్‌ చేసుకునే ప్రయాణికులు గంటల ప్రకారం లేదా నగరాల మధ్య లేదా విమానాశ్రయం నుంచి గమ్యస్థానాలకు చేరేందుకు వీలుగా ఆప్షన్లు ఇస్తున్నట్లు పేర్కొంది. ఒకవేళ విమానం రావడం ఆలస్యమైతే వేచి ఉండే ఛార్జీలు గానీ రద్దు ఛార్జీలు కూడా ఉండవని తెలిపింది.