Movies

MGR లుల్ వచ్చేసింది

MGR లుల్ వచ్చేసింది

కోలీవుడ్‌ హీరో అరవింద్‌ స్వామి నటించిన చిత్రం ‘తలైవి’. ఈ చిత్రంలో ఆయన ఎంజీఆర్‌ పాత్రలో అలరించనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఆయన పాత్రకు సంబంధించిన కొత్త లుక్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ వర్ధంతిని గుర్తుచేస్తూ ఆయన పోషించిన ఎంజీఆర్‌ పాత్ర కొత్త లుక్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా ‘తమిళనాడు పురచ్చితలైవర్‌ ఎంజీఆర్‌ పాత్ర చేయటం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఇది ఎంతో గొప్ప బాధ్యత కలిగిన పాత్ర. నన్ను నమ్మి, నాకు ఈ పాత్రలో నటించేందుకు అవకాశం ఇచ్చిన దర్శకుడు ఏఎల్ విజయ్‌, నిర్మాతలు విష్ణువర్ధన్, ఇందూరి, శైలేష్ సింగ్‌లకు ధన్యవాదాలు’ అని అరవింద్ చెప్పారు. ‘ధృవ’ చిత్రంలో అరవింద్‌ ప్రతినాయకుడి పాత్రలో ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే.