DailyDose

సీకి పెట్రోల్ పోసి నిప్పంటించిన కబ్జాదారులు-నేరవార్తలు

Crime News - Land Kabja Criminals Pours Petrol And Fires CI In Medchal

* మేడ్చల్ జిల్లా కాప్రా మండలం.జవహర్ నగర్ లో దారుణం.భూకబ్జా అడ్డుకొవడానికి వెళ్లిన సీఐ బిక్షపతి రావు.పెట్రోల్ పోసి నిప్పంటించిన కబ్జాదారులు.

* కరుడుగట్టిన నేరస్థుడిగా ముద్రపడిన మంత్రి శంకర్‌ను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. శంకర్‌తో పాటు అతని ముగ్గురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ. 12 లక్షల నగదు, సిల్వర్ ఆభరణాలు,రెండు వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి నేరాలకు పాల్పడడంలో శంకర్‌ దిట్ట. ఇప్పటివరకు సుమారు 300 దొంగతనాలకు పాల్పడ్డ శంకర్‌ 30 సార్లు అరెస్ట్‌ అయ్యాడు. మహారాష్ట్రలోని నాసిక్‌ ప్రాంతానికి చెందిన మంత్రి శంకర్‌కు అతని స్వగ్రామంలో మంచి దానఖర్ముడని పేరు ఉండడం విశేషం. కాగా హైదరాబాద్‌లో సెటిల్‌ అయిన మంత్రి శంకర్‌కు ముగ్గురు భార్యలు.. ఆరుగురు సంతానం ఉన్నారు. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ‌ ‘ ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతూ మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ముద్రపడిన మంత్రి శంకర్‌ను పట్టుకున్నాం. అతనితో పాటు అనుచరులు అబ్దుల్ లతీఫ్ ఖాన్, మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ఇంతియాజ్ అహ్మద్ ను అదుపులోకి తీసుకున్నాం. నిందితుల నుంచి 12 లక్షల 9వేల నగదు, 100 గ్రాముల అర్నమెంట్ బంగారం,రెండు బైకులు స్వాధీనం చేసుకున్నాం. మంత్రి శంకర్ 1979 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. అతనిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 250 కేసులు ఉన్నాయి.ఈ గ్యాంగ్ పగలు రెక్కీ చేసి రాత్రి 1 నుంచి 4 గంటల మధ్య దొంగ తనాలు చేస్తుంది. ఈ నెల 4న జైలు నుంచి విడుదలైన శంకర్‌ బయటకు వచ్చిన 20 రోజుల్లోనే 6 దొంగతనాలకు పాల్పడ్డారు. కుషాయిగూడ,వనస్థలిపురం, బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేశారన్నారు.

* నూజివీడు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్రిబంధం గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఎస్ఐ రంజిత్ కుమార్ గారు సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. నిర్వహించిన దాడుల్లో 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారి వద్దనుండి 1,78,240/- నూజివీడు తాలూకా పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.

* సైబ‌రాబాద్ ప‌రిధిలో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం విధించిన‌ట్లు సీపీ స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు.డిసెంబ‌ర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్‌, అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్ క‌మ్యూనిటీల‌లో నూత‌న సంవ‌త్స‌ర‌ వేడుక‌ల‌కు అనుమ‌తి లేద‌ని తేల్చిచెప్పారు.నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే నిర్వాహ‌కుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ హెచ్చ‌రించారు. పోలీసుల‌కు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని సీపీ స‌జ్జ‌నార్ కోరారు.

* మంత్రి మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీకి నేష‌న‌ల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేష‌న్ కౌన్సిల్ (న్యాక్‌) షాక్ ఇచ్చింది.కొంపల్లిలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీపై 5 సంవత్సరాలు బ్యాన్ విధించింది.ఈ విషయాన్ని న్యాక్ అధికారిక వెబ్‌సెట్‌ ద్వారా ప్రకటించింది.మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్‌కు 2018లో B++ గ్రేడ్‌ను న్యాక్ కేటాయించింది.అయితే ఇంకా మంచి గ్రేస్ సాధించాలనే ఉద్దేశ్యంతో కాలేజీ యాజమాన్యం న్యాక్‌ను మోసం చేసే ప్రయత్నిం చేసింది.న్యాక్ బెంగళూర్‌కు సెల్ఫ్ స్టడీ రిపోర్ట్‌లో నకిలీ డాక్యూమెంట్లను పంపించారు.న్యాక్ కౌన్సిల్ వారు ఈ విషయాన్ని పసిగట్టారు.మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం చీటింగ్‌కు పాల్పడిందంటూ ఆ కాలేజీపై చర్యలకు ఉపక్రమించింది.అక్రిడేషన్ విషయంలో 5 సంవత్సరాల పాటు బ్యాన్ విధించింది. ఈ విషయాన్ని న్యాక్ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.