NRI-NRT

ఫ్లోరిడా నిరాశ్రయులకు నాట్స్ వితరణ

NATS Donates Blankets To Florida Homeless

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఫ్లోరిడా రాష్ట్రంలోని టెంపాబేలో నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసింది. నాట్స్ టెంపాబే విభాగం, హోమ్‌లెస్ ఆఫ్ పస్కో కౌంటీతో కలిసి టెంపాబేలో చలికి ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులకు ఈ దుప్పట్లను పంపిణీ చేసింది. డాక్టర్ నీరజ జాస్తి స్నేహబృందం ఈ సామాగ్రిని అందజేశారు. నాట్స్ ప్రతినిధులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని, శ్రీనివాస్ మల్లాది, సుధీర్ మిక్కిలినేని, సురేశ్ బొజ్జ, సుమంత్ రామినేని‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.