Business

LIC నుండి నూతన పెన్షన్ పథకం-వాణిజ్యం

LIC నుండి నూతన పెన్షన్ పథకం-వాణిజ్యం

* సీనియర్ సిటిజన్ల కోసం పీఎం వయ వందన యోజన (పీఎంవీవీవై) పెన్షన్ పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించిన తరువాత, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కేంద్రం సబ్సిడీతో అనుసంధానించని పెన్షన్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇటీవలే 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను, ఆర్థిక మంత్రిత్వ శాఖ పెన్షన్ ప్లాన్ ను 7.40 శాతం వడ్డీ రేటుతో మార్చి 31, 2023 వరకు పొడిగించింది.

* ఆరోగ్య బీమా ఎంచుకున్న పరిమితి మేరకు మాత్రమే వైద్యఖర్చులను చెల్లిస్తుంది. ఒక వేళ మనకేదైనా అనారోగ్యం వచ్చి ఆరోగ్య బీమా పాలసీ అందించే బీమా సొమ్ముకు మించి ఖర్చైతే మిగతా సొమ్మును మన చేతి నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా అని ఎక్కువ మొత్తానికి బీమా తీసుకోవాలి అంటే ప్రీమియం అధికంగా చెల్లించడం భారం అవుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రూపొందించినవే ‘టాప్అప్ పాలసీలు’. అందుబాటులో ఉండే ప్రీమియంతో అవసరం అయినప్పుడు అధిక మొత్తంలో బీమా చెల్లించి ఆదుకునే వీలును టాప్అప్ కల్పిస్తాయి. ఆరోగ్య బీమాలో అందించే హామీ సొమ్ము పరిధి ‘త్రెషోల్డ్‌ లిమిట్‌’ దాటాక టాప్‌ అప్‌ అందుబాటులోకి వస్తుంది. అదనపు బీమా సొమ్ము కావాలనుకున్న వ్యక్తులు లేదా పెరుగుతున్న వైద్య ఖర్చులకు ప్రస్తుత పాల‌సీ సరిపోదని భావించినట్టయితే టాప్‌ అప్‌ పాలసీ తీసుకోవడం మంచిది.

* దంపతులు ఇద్దరూ ఆర్జించే కుటుంబాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్థిక ప్రణాళికలు, జీవిత బీమా పాలసీలు, పన్ను ఆదా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇద్దరికీ తప్పనిసరి అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్జించే మహిళలు ఆదాయపు పన్ను విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పన్ను ఆదాకు ఉన్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి. ఆదాయపు పన్ను చట్టం అనుమతించిన పరిమితికి మించి ఆదాయం ఆర్జించినప్పుడు నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సిందే. కాబట్టి, కేవలం పురుషులకే కాదు… మహిళలకూ ఆదాయపు పన్ను ప్రణాళిక ఉండాలి. పన్ను ప్రణాళికలు వేసుకునేప్పుడు వయసు, వస్తున్న ఆదాయం, సొంతంగా తనకు ఉన్న లక్ష్యాలు, కుటుంబ ఆర్థిక లక్ష్యాలు తదితరాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవాలి. చాలామంది మహిళలు పన్ను ఆదా గురించి ఫిబ్రవరి-మార్చిలలోనే పట్టించుకుంటారు. ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయపు పన్ను పథకాల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన రశీదులను యాజమాన్యానికి అందించాల్సి ఉంటుంది. ఆర్జించే మహిళలు తమ పన్ను ప్రణాళికలను ముందునుంచే సిద్ధం చేసుకుంటే… చివర్లో ఈ హడావుడి ఉండదు.

* 2021 జనవరి నుంచి ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజెరేటర్లు, వాషింగ్‌ మిషిన్‌లు వంటి సామగ్రి ధరలు జనవరి నుంచి దాదాపు 10శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. వీటిల్లోని ముడిపదార్థాలైన కాపర్‌, అల్యూమినియం, స్టీల్‌, ప్లాస్టిక్‌ ధరల ప్రభావం వీటిపై పడనుంది. దీంతోపాటు నౌకారవాణా, విమానాల్లో కార్గో ధరల్లో పెరుగుదల ప్రభావం కూడా వీటిపై పడనుంది. ఇవే కాకుండా సరఫరా తగ్గడంతో టీవీ ప్యానల్‌ (ఓపెన్‌ సెల్‌) ధరలు రెండింతలయ్యాయి. దీంతో ఎల్‌జీ, పానాసానిక్‌, థాంమ్సన్‌ జనవరి నుంచి ధరలు పెంచనున్నాయి. సోనీ పరిస్థితిని సమీక్షిస్తోంది.. ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

* ఇంటిని అద్దెకు తీసుకోవాలా లేదా సొంత ఇంటిని కొనుగోలు చేయాలా అనే విషయంలో గందరగోళానికి గురవుతున్నారా? ఒకవేళ మీరు యవ్వనంలో ఉండి, డబ్బు సంపాదిస్తూ ఉన్నట్లయితే, కనీసం ఒకసారైనా ఈ ప్రశ్న మీ మనస్సులోకి వచ్చి ఉండాలి. గృహ రుణాల గురించి టెలికాల్లర్ల నుంచి అనేకసార్లు ఫోన్ కాల్స్ కూడా పొందివుంటారు. ఒకవేళ మీరు చాలా డబ్బు సంపాదిస్తూ ఉన్నా లేదా ఇప్పటికే పెద్ద మొత్తంలో ఆదాయం కలిగి ఉన్నట్లయితే, మీరు గృహ రుణం తీసుకోవడం చాలా సులభం అవుతుంది. కానీ ఎవరైతే వారి నెల జీతం మీద ఆధారపడి జీవిస్తూ, ఈఎంఐ లపై గృహ రుణాలను తీసుకున్నట్లైతే, వారు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈఎంఐలపై ఇంటిని కొనుగోలు చేయడం దీర్ఘకాలంలో అంత సులువు కాకపోవచ్చు. ఒకవేళ మీ నెల జీతం రూ. 50,000 నుంచి రూ. 60,000 మధ్య ఉందనుకుందాం. మీరు నెలకు రూ. 15,000 అద్దె చెల్లిస్తూ ఒక అపార్ట్ మెంట్లో నివసిస్తున్నారు.

* ఇటీవల ఒక దుర్వార్త విన్నాం, అదే 178 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న కంపెనీ ’ థామస్ కుక్ ’ మూతపడడం. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా అందులో పనిచేసే 22 వేల మందికి ఉద్యోగాలు పోవడమే కాక , ఆ సంస్థ ద్వారా సేవలు పొందుతున్న విహారయాత్రలకు వెళ్లిన 6 లక్షల ప్రయాణికులు వివిధ ప్రదేశాల నుంచి తిరిగి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే సొమ్ము చెల్లించి, ఇంకా సేవలు వినియుగించుకోనివారు , వారి సొమ్ము ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదు. రాత్రికిరాత్రే కంపెనీ మూతపడుతున్నట్లు ప్రకటించింది. దీనికి అసలు కారణం మోయలేని అప్పుల భారం. ఇటువంటి సమయంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినా , అధిక రుణ భారంతో ఉన్న కంపెనీని తిరిగి గాడిలో పెట్టడం చాలా కష్టమే.