Devotional

రాళ్లే దేవుడికి నైవేద్యం

Stone Nagendra In Chintalapudi In Andhra

గుడికి వచ్చే భక్తులు టెంకాయలు కొట్టి, పూలు, నెయ్యి, పాలతో ధూప, దీప నైవేద్యాలు సమర్పిస్తారు. కానీ చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం శివారులోని రాళ్ల నాగేంద్రునికి ఇవేమీ అవసరం లేదు. తన దగ్గరకు వచ్చే భక్తులు కేవలం మూడు రాళ్లు సమర్పిస్తే చాలు… కోరిన కోరికలు నెరవేరతాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రదేశం వందేళ్ల కిందట అటవీ ప్రాంతంలో ఉండేదట. ఈ మార్గంలో నడిచి వెళుతున్న కొందరు రెండు రాళ్లపై నాగేంద్రుని స్వరూపం ఉండటం గమనించారు. వాటిని ఒకచోటకు చేర్చి పూజలు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ మార్గంలో వెళ్లేవారు రాయి వేసి మొక్కుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం అది గుట్టగా మారిపోయింది. ఇదే గ్రామానికి చెందిన రేగుల బాబు, అనసూర్య దంపతులు పదేళ్ల కిందట గుడిని నిర్మించి నాగేంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి వీరు నాగేంద్రుని గొప్పతనాన్ని వివరిస్తూ పూజలు చేస్తున్నారు.