DailyDose

విశాఖలో ఉత్కంఠ-తాజావార్తలు

TDP X YSRCP Tensions In Vizag Over Velagapudi Comments

* తెదేపా, వైకాపా ప్రమాణ సవాళ్లతో ఉత్కంఠ.విశాఖలో తెదేపా, వైకాపా ప్రమాణ సవాళ్లతో కొనసాగుతున్న ఉత్కంఠ.విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి.విశాఖ బీచ్‌ రోడ్డులోని వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద చేరుకున్న వైకాపా శ్రేణులు .గాజువాక మం. మింది నుంచి భారీ వాహన శ్రేణితో వచ్చిన ఎమ్మెల్యే అమర్నాథ్‌ .విశాఖ ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడికి వెళ్లనున్న వైకాపా వర్గీయులు.ఎమ్మెల్యే అమర్నాథ్ నేతృత్వంలో సాయిబాబా గుడికి వెళ్లనున్న వైకాపా శ్రేణులు.ఉదయం 11 నుంచి సాయిబాబా గుడి వద్ద ఉంటామని గుడివాడ అమర్నాథ్‌ సవాల్ .తెదేపా ఎమ్మెల్యే వెలగపూడి కార్యాలయంలో అదే సమయానికి నిరసన కార్యక్రమం .తాను సవాలు విసిరింది ఎంపీ విజయసాయిరెడ్డికి అన్న ఎమ్మెల్యే వెలగపూడి .నాపై ఆరోపణల్లో నిజం ఉంటే దేవుడిపై ప్రమాణం చేయాలని విజయసాయికి వెలగపూడి సవాల్ .విజయసాయి సవాల్‌ స్వీకరించకుండా అందరితో మాట్లాడిస్తున్నారన్న వెలగపూడి .విజయసాయి వస్తే అప్పన్న సాక్షిగా ప్రమాణం చేస్తానన్న వెలగపూడి.

* ఉత్తరప్రదేశ్‌లోని వాహనాలపై ఇకపై జాతివాదం కనిపించకూడదు.ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నుంచి వచ్చిన ఆదేశాలను యూపీ రాష్ట్ర రవాణాశాఖ జారీ చేసింది.యూపీలో వాహనాలపై కులాలు, జాతుల పేర్లు ఉంటున్నాయని, వీటి వలన ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉందని మహారాష్ట్రకు చెందిన ఉపాధ్యాయుడు పీఎంఓకు ఫిర్యాదు చేసిన మీదట ఈ విధమైన నిర్ణయం వెలువడింది.ఉత్తరప్రదేశ్‌లో కార్లు, బైక్‌లు, బస్సులు, ట్రక్కులు, చివరికి ఈ రిక్షాలపైన కూడా ‘బ్రాహ్మణ’, ‘క్షత్రియ’, ‘జాట్’, ‘యాదవ’, ‘కురేషి’ అని కనిపిస్తుంటాయి.ముంబైలోని కల్యాణ్‌లో ఉంటున్న ఉపాధ్యాయుడు హర్షల్ ప్రభు ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకువెళ్లారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఇదేవిధమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.వారు తమ కులాన్ని చెప్పుకుంటూ గొప్పగా భావిస్తున్నారని ఆరోపించారు.అయితే ఇటువంటి వ్యవహారం వలస ఇది సామాజిక సమస్యగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను వెంటనే నియంత్రించాలని ఉపాధ్యాయుడు హర్షల్ ప్రభు ప్రధాని మోదీని కోరారు.ఈ ఫిర్యాదును ప్రధాని కార్యాలయం యూపీ సర్కారుకు పంపింది.వెంటనే స్పందించిన యూపీ అదనపు రవాణా కమిషనర్ ముఖేష్ చంద్ర ఇటువంటి వాహనాలపై చర్యలకు ఆదేశాలు జారీచేశారు.ఏ వాహనాలపై జాతివాదం కనిపించినా వాటిని వెంటనే సీజ్ చేయాలని ఆర్టీఓలను ఆదేశించారు.

* కరోనా మహమ్మారే మానవాళి ఎదుర్కొనే చివరి సంక్షోభం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.పర్యావరణ మార్పులను నివారించని పక్షంలో ప్రజారోగ్యం మెరుగు పరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆధోగతి తప్పదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ వ్యాఖ్యానించారు.సంక్షోభ సమయాల్లో డబ్బులు వెదజల్లుతూ తాత్కాలిక పరిష్కారాల కోసం ప్రయత్నించే ప్రభుత్వాల వైఖరిపై కూడా ఆయన మండిపడ్డారు.ఈ దూరదృష్టి లేమీ ప్రమాదకరమని, అప్పటికప్పుడూ పరిష్కాల కోసం వెతుకులాడకుండా దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలని కోరారు.కరోనా సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.‘సంక్షోభం సమయాల్లో గాబరా పడటం..పరిస్థితి కుదుటపడ్డాక నిర్లక్ష్యం ప్రదర్శించడటం గత కొంత కాలం ప్రపంచం మొత్తం ఇదే వైఖరిని అవలంబిస్తోంది.

* అపోలో ఆస్పత్రి నుంచి రజినీకాంత్‌ డిశ్చార్జ్‌అపోలో ఆస్పత్రి నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్‌ డిశ్చార్జ్‌ అయ్యారు.వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని రజినీకాంత్‌కు వైద్యుల సూచించారు.ఒత్తిడికి గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారు. కాసేపట్లో చెన్నైకి ఆయన బయలుదేరనున్నారు. ఇటీవల రజినీకాంత్‌ అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే.రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులకు అందిన ఆరోగ్య పరీక్షల నివేదిక ప్రకారం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారణ అయింది.

* ‘మోదీగారు ఇక చాలు, ముచ్చట్లు ఆపండి’…ప్రధాని నరేంద్ర మోదీ 72 వ మన్‌ కీ బాత్‌ కార్యక్రమానికి వ్యతిరేకంగా రైతులు, నెటిజన్ల పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లూ రేడియోలో మీరు చెప్తున్నదంతా వినీ వినీ అలసిపోయాం. ఇక చాలు ఆపండి. మా గోడు కూడా వినండి అని రైతులు విమర్శిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు బోర్డర్‌, ఫరీద్‌కోట్‌, రోహ్‌తక్‌ ప్రాంతాల్లో ప్లేట్లు, డబ్బాలు మోగించి నిరసన తెలిపారు. ఈ మూడు ప్రాంతాలు బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలోనివి కావడం విశేషం.

* దేశంలో కరోనా వైరస్‌ విజృంభణ కాస్త అదుపులోనే ఉన్నప్పటికీ రోజువారీగా దాదాపు 20వేల కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ఇక రేపటినుంచి మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 66మంది అధికారులు, సిబ్బంది, ఎమ్మెల్యేలలో వైరస్‌ బయటపడింది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్‌ రామేశ్వర్‌ శర్మ మీడియాకు వెల్లడించారు.

* పాకిస్థాన్‌కు అరబ్‌ ప్రపంచంలో ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఇజ్రాయెల్‌తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకోగానే.. పాకిస్థాన్‌కు పూనకం వచ్చింది. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోపక్క పాక్‌ను ఎగదోసిన టర్కీ మాత్రం ఇజ్రాయెల్‌తో సంబంధాలను నెరుపుతోంది. తాజాగా ఇజ్రాయెల్‌లో తన రాయబారిని నియమించింది. ఈ పరిణామం పాక్‌ను ప్రపంచం ముందు వెర్రిదాన్ని చేసింది.

* భారత యువతను చూసినప్పుడల్లా తనలో భరోసా పెరుగుతుందని, మనసు ఉల్లాసంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏదైనా సాధించగలం, చేయగలమన్న వారి సంకల్పం స్ఫూర్తినిస్తుందన్నారు. ఎంతటి సవాలైనా వారి ముందు చిన్నదే అని వ్యాఖ్యానించారు. వారి వల్ల సాధ్యం కానిది ఏదీ లేదంటూ దేశ యువతలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని తన మనోగతాన్ని పంచుకున్నారు. స్వయం సమృద్ధి, భారత్‌లో తయారీ వంటి పలు కీలక అంశాలపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మన్ కీ బాత్‌ కావడం గమనార్హం.

* దక్షిణాది చిత్రపరిశ్రమతోపాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా మారుతున్నారు కథానాయిక పూజాహెగ్డే. ఇప్పటికే ఆమె చేతిలో ‘రాధేశ్యామ్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ‘సర్కస్‌’ చిత్రాలున్న విషయం తెలిసిందే. వీటితోపాటు ‘ఆచార్య’ సినిమాలో చెర్రీ సరసన పూజాహెగ్డే సందడి చేయనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా పూజాహెగ్డే కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

* వ్యవసాయ చట్టాలపై రాహుల్‌ గాంధీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. మధ్యవర్తుల వల్ల రైతులు నష్టపోతున్నారంటూ..నేరుగా పంటను అమ్ముకునేవిధంగా చర్యలు తీసుకోవాలని మాట్లాడిన ఆయనే ఇప్పుడు ఆ చట్టాలను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. వీటికి సంబంధించి గతంలో లోక్‌సభలో రాహుల్‌ గాంధీ మాట్లాడిన వీడియోను జేపీ నడ్డా ట్విటర్‌లో షేర్‌ చేశారు.

* జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యతల నుంచి బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ తప్పుకొన్నారు. ఆర్‌సీపీ సింగ్‌ (రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌) నూతన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ సభ్యుడైన ఆర్‌సీపీ సింగ్‌ పేరును నీతీశ్‌ ప్రతిపాదించగా.. పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించే దిశగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోటారు వాహనాల ధ్రువపత్రాల వ్యాలీడిటీ గడువును పెంచుతూ నిర్ణయించింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ పత్రం, పర్మిట్ పత్రాల వ్యాలిడిటీ గడువును మార్చి 31, 2021 వరకు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

* సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిల్లలకే విదేశీ చదువులా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా అని విమర్శించారు. ప్రైవేటు కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వైకాపా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ఖండిస్తున్నామని ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి మంచిది కాదని హితవు పలికారు.

* తాడిపత్రి పట్టణంలో గురువారం తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అడుగడుగునా నిఘా పటిష్టం చేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడి,్డ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల నివాసాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వజ్ర వాహనాలతో పహారా కాస్తున్నారు. కాలనీలోకి ఎవరు ప్రవేశించినా కూడా వీరి నివాసాల వద్దకు రాకుండా చూసుకుంటున్నారు.

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై విపక్షాలు అందరినీ మభ్యపెడుతున్నాయని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో నిర్వహించిన భాజపా రైతు సాధికార సదస్సులో ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కొత్త చట్టాల విషయంలో రైతులు ఐదు అంశాలపై ఉద్యమిస్తున్నారని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధర కొనసాగుతుందన్నారు. వ్యవసాయ మార్కెట్లు మూతపడతాయనే ప్రచారం అపోహ మాత్రమేనని చెప్పారు. రైతుల భూములకు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. రైతులకు నిర్దేశించిన ధరను గడువులోగా చెల్లించపోతే జరిమానా విధిస్తారని వీర్రాజు వివరించారు. చాలా రాష్ట్రాల్లో ఒప్పంద వ్యవసాయ విధానం అమల్లో ఉందని ఆయన గుర్తు చేశారు.