Sports

ఇండియా పడిలేవడం ముచ్చటగా ఉంది

Akhtar Praises Rahane For Winning Melbourne Test

అడిలైడ్‌లో ఘోర పరాభవం పాలైన టీమ్‌ఇండియా మెల్‌బోర్న్‌ టెస్టుతో సత్తా చాటిందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ కొనియాడాడు. అజింక్య రహానె సారథ్యంలో బలంగా పుంజుకుందని చెప్పాడు. తాజాగా తన యూట్యూబ్‌లో మాట్లాడిన పేస్‌ దిగ్గజం తాత్కాలిక కెప్టెన్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఏ జట్టు అయినా ఇలా సత్తా చాటితే తనకు ముచ్చటేస్తుందన్నారు. రహానె జట్టు బాధ్యతల్ని తనపై వేసుకొని మ్యాచ్‌ను మలుపు తిప్పాడని అక్తర్‌ ప్రశంసించాడు.