Movies

అమితాబ్ కూతురిగా

అమితాబ్ కూతురిగా

ప్రస్తుతం టాలీవుడ్‌లో సూపర్‌ బిజీ హీరోయిన్‌గా ఉన్నారు రష్మికా మందన్నా. ఇటీవలే తన తొలి హిందీ సినిమా కమిట్‌ అయిన ఆమె అక్కడా అదే జోరుని చూపిస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా తెరకెక్కనున్న ‘మిస్టర్‌ మజ్ను’లో హీరోయిన్‌గా నటించనున్నారు రష్మిక. తాజాగా రెండో హిందీ సినిమా కూడా అంగీకరించారట. ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో కలసి యాక్ట్‌ చేయనున్నారు రష్మిక. అమితాబ్‌ ప్రధాన పాత్రలో వికాస్‌ బాల్‌ దర్శకత్వంలో ‘డాడీ’ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో అమితాబ్‌ కుమార్తె పాత్రలో కనిపించనున్నారట ఆమె. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.