DailyDose

జనవరి 31 వరకు కరోనా ఆంక్షలు-తాజావార్తలు

Telugu News Roundup Of The Day - Jan 31st COVID Restrictions In India

* దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి విధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జనవరి 31వరకూ కొవిడ్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31వరకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసింది. బ్రిటన్‌లో కలకలం సృష్టించిన కరోనా కొత్త వైరస్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని నిరంతరం నిఘా, వైరస్‌ కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

* యావత్‌ దేశం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ జనవరిలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ అదర్‌ పూనావాలా మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నూతన సంవత్సరం శుభవార్తగా అభివర్ణించిన ఆయన, ఇప్పటికే దాదాపు 5కోట్ల ‘కొవిషీల్డ్‌’ టీకా డోసులను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు.

* కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇసుక లారీ ఢీకొని విజయ్‌ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. లారీ కింద పడిన యువకుడి శరీరమంతా నుజ్జునుజ్జయింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఇసుక లారీలను రోడ్డుపైనే అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీకి నిప్పుపెట్టడంతో అది దగ్ధమైంది. మిగిలిన 4 ఇసుక లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపైనా స్థానికులు దాడి చేశారు. ఈ ప్రాంతంలో ఇసుక రవాణా చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో అక్కడి విచారణ కోసం వచ్చిన పోలీసులపై స్థానికులు దాడికి దిగారు.

* తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై మక్కల్‌ నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు 17 సేవలకు ప్రజల నుంచి లంచాలు వసూళ్లు చేయడంపై అన్నాడీంఎకే ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరూ లంచం చెల్లించాల్సి వస్తోందని, లంచాలు తీసుకున్న తర్వాతే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రమంతటా దాదాపు ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘బ్రైబ్ రేట్‌ కార్డు’ను మీడియాకు విడుదల చేశారు. ఈ కార్డులో ఆయా ప్రభుత్వ సర్వీసులకు ప్రభుత్వ కార్యాలయాల్లో డిమాండ్‌ చేసే మొత్తాల జాబితాను పేర్కొన్నారు. ఈ జాబితాను ఎవరైనా తిరస్కరించగలరా? అని ప్రశ్నించారు.

* చర్చల విషయంలో తాము ప్రతిపాదించిన అజెండాను కేంద్రం అంగీకరించడం లేదని, దీనిబట్టి సమస్య పరిష్కారానికి కేంద్రం సుముఖంగా లేదనేది అర్థమవుతోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పేర్కొంది. తెలివిగా మాటలతో మాయ చేయాలని చూస్తోందని ఆరోపించింది. తమ అజెండాను చర్చించేందుకు సిద్ధంగా లేని కేంద్రం.. మరోవైపు చర్చలకు సిద్ధమంటూ తమను ఆహ్వానించడం రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

* రాష్ట్ర సాగునీటి రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా జలవనరులశాఖను తెలంగాణ ప్రభుత్వం పునర్‌ వ్యవస్థీకరించింది. ప్రగతిభవన్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖకు కొత్త స్వరూపాన్ని ఖరారు చేశారు. ఇకనుంచి భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నీ ఒకే గొడుగు కింద పనిచేయనున్నాయి. ఒక ప్రాంతంలోని అన్ని రకాల జలవనరులశాఖ వ్యవహారాలన్నీ ఒకే అధికారి పర్యవేక్షించేలా ప్రక్రియను పూర్తి చేశారు. రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశికాలుగా గుర్తించి ఒక్కో ప్రాంతానికి ఒక్కో చీఫ్‌ ఇంజినీర్‌కు పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఇకపై రాష్ట్రంలో ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలు ఉండనున్నాయి.

* ఉల్లిపాయల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జనవరి 1 నుంచి అన్ని రకాల ఉల్లిపాయలను స్వేచ్ఛగా విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చని, ఎలాంటి నిషేధం ఉండదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. బెంగళూరు రోజ్‌, కృష్ణాపురం ఉల్లి రకాలను కూడా ఎగుమతి చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.

* రాష్ట్ర సాగునీటి రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా జలవనరులశాఖను తెలంగాణ ప్రభుత్వం పునర్‌ వ్యవస్థీకరించింది. ప్రగతిభవన్‌లో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జలవనరుల శాఖకు కొత్త స్వరూపాన్ని ఖరారు చేశారు. ఇకనుంచి భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నీ ఒకే గొడుగు కింద పనిచేయనున్నాయి.

* ఏపీలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ ఆనవాళ్లు బయటపడలేదని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. యూకే నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు 1,363 మంది వచ్చారని చెప్పారు. వీరిలో 1,346 మందిని క్వారంటైన్‌కు పంపామని.. ఇంకా 17 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. యూకే నుంచి వచ్చిన వారిలో 11 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని.. వారి కాంటాక్టుల్లో 12 మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. దీనికి సంబంధించి పుణె వైరాలజీ ల్యాబ్‌, సీసీఎంబీ నుంచి ఇంకా నివేదికలు రావాల్సి ఉందన్నారు.

* దేశంలో కరోనా వైరస్‌ కట్టడికి విధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. జనవరి 31వరకూ కొవిడ్‌ మార్గదర్శకాలు అమలులో ఉంటాయని స్పష్టం చేస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలే జనవరి 31వరకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసింది.

* దేశంలో వందో కిసాన్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మహారాష్ట్రలోని సంగోలా నుంచి బెంగాల్‌లోని షాలిమార్‌ వరకు ప్రయాణించే ఈ రైలుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రైతు సాధికారతలో కిసాన్‌ రైలు ఓ పెద్ద ముందడుగు అన్నారు. దేశంలో 80శాతంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులను మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. వ్యవసాయరంగంలో చరిత్రాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని, వ్యవసాయాన్ని, రైతులను బలోపేతం చేసేలా అనేక సంస్కరణలు చేపడుతున్నామని మోదీ చెప్పారు.

* తమిళనాడులోని ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై మక్కల్‌ నీది మయ్యం అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు 17 సేవలకు ప్రజల నుంచి లంచాలు వసూళ్లు చేయడంపై అన్నాడీంఎకే ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ఏ పని జరగాలన్నా ప్రతి ఒక్కరూ లంచం చెల్లించాల్సి వస్తోందని, లంచాలు తీసుకున్న తర్వాతే పనులు జరుగుతున్నాయని ఆరోపించారు.

* స్వచ్ఛభారత్‌ స్ఫూర్తిగా ప్లాస్టిక్‌పైనా ప్రజా ఉద్యమం రావాలని.. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌పై జనజాగృతి అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్‌తో ఇబ్బంది లేదని.. వినియోగంలో ప్రజల వైఖరితోనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రకృతితో ప్రేమగా ఉండాలని హితవు పలికారు. విజయవాడ నగర శివారులోని సూరంపల్లిలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సీపెట్‌) కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి సందర్శించారు.

* దేశంలో అసమ్మతి తెలిపే, పలు సమస్యలపై చర్చించే వేదికలు కుచించుకుపోతున్నాయని నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దేశ ద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా సరైన విచారణ లేకుండానే శిక్షలకు గురవుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతు పలికిన ఆయన.. చట్టాలను సమీక్షించాల్సిన అవసరాన్ని తాజా నిరసనలు స్పష్టం చేస్తున్నాయని నొక్కిచెప్పారు.

* భారత్‌లోకి చైనీయుల ప్రవేశంపై నిషేధం విధించారంటూ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు. ‘ఏ దేశ పౌరుడు రావాలో సూచనలు చేయడం తప్పు. మావైపు నుంచి ఆలాంటి ఆదేశాలు వెళ్లలేదు’ అని ఆయన మీడియాకు వెల్లడించారు. చైనా జాతీయులు దేశంలోకి ప్రవేశించకుండా ఉండేలా విమానయాన సంస్థలకు కేంద్రం అనధికారిక సమాచారం ఇచ్చిందని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

* వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దిల్లీ సరిహద్దుల్లో నెల రోజులుగా ఉద్యమిస్తున్న రైతులను కేంద్రం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ నెల 30న చర్చలు జరిపేందుకు రావాలని రైతు సంఘాలను కోరింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి విజ్ఞాన్‌ భవన్‌లో చర్చలు జరిపేందుకు రావాలంటూ 40 రైతు సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా లేఖ రాసింది.

* పదవీకాలం ముగుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనాకు చెక్‌ పెట్టే చర్యలను కొనసాగిస్తూనే ఉన్నారు. చైనా ప్రమేయం లేకుండా టిబెట్‌ తమ దలైలామా వారసుడిని ఎన్నుకునే వీలు కల్పించే బిల్లును అమెరికా చట్టసభ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ బిల్లుపై డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేశారు. తాజా బిల్లుతో టిబెట్‌లో అమెరికా రాయబార కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. దీనికి చైనా అడ్డుతగిలే ఆస్కారం ఉన్న కారణంగా చైనాపై ఆంక్షలు విధించింది.