Movies

భారీ కథలకు కాలం చెల్లింది

భారీ కథలకు కాలం చెల్లింది

ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న విలక్షణ నటుల జాబితాలో నవాజుద్దీన్‌ సిద్ధికీ ముందు వరుసలో ఉంటారు. లాక్‌డౌన్‌ దెబ్బకు ఆగిపోయిన చాలా సినిమాల చిత్రీకరణలు ఇప్పుడిప్పుడే సెట్స్‌పైకి వస్తున్నాయి, అయితే ఈ లాక్‌డౌన్‌లోనే నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించిన కొన్ని చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. గూమ్‌కేతు, సీరియస్‌ మ్యాన్‌ అంటూ ప్రేక్షకులను తన నటనతో అలరించాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై సహజత్వంతో కూడిన సినిమాలను మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారని, సూపర్‌ హీరో తరహా కథలను ప్రేక్షకులు పట్టించుకోరన్నారు. స్టీరియో టైపు కథలకు కాలం చెల్లిందన్నారు. భారీ పోరాట దృశ్యాలు అస్సలే అవసరం లేదన్నారు. ఓటీటీల రాకతో సినీ ప్రియుల అభిరుచి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. నవాజుద్దీన్‌ నటించిన నెట్‌ఫ్లిక్స్‌ చిత్రం ‘రాత్‌ కీ ఆకేలి హై’ చిత్రంలో ఆయన నటనకు కచ్చితంగా ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకుంటారని అంతా భావిస్తున్నారు.