Movies

దేవుడు శాసించాడు. రజనీ విరమించాడు.

దేవుడు శాసించాడు. రజనీ విరమించాడు.

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టట్లేదని తలైవా నేడు స్పష్టం చేశారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా తన ప్రజాసేవ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖ విడుదల చేశారు. ‘ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నా. ఆరోగ్యం ప్రాధాన్యమని ఆత్మీయులు సూచించారు. ఎంతో భారమైన హృదయంతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నా. ఇటీవల అనారోగ్య బారినపడటాన్ని దేవుడి సూచనగా భావిస్తున్నా. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటీవల 120 మంది ఉన్న మా చిత్రబృందంలో కొందరు కరోనాకు గురయ్యారు. అలాంటిది నేను ఎన్నికల బరిలోకి దిగితే లక్షల మంది జనం మధ్యలోకి వెళ్లాలి. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను సాహసం చేయలేను. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టలేను. కేవలం సోషల్‌మీడియా ప్రచారంతో ఏ పార్టీ కూడా గెలువలేదు. అయితే నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా నా ప్రజాసేవ నిరంతరం సాగుతోంది’ అని రజనీ లేఖలో పేర్కొన్నారు. తన నిర్ణయం అభిమానులను విపరీతంగా బాధపెట్టి ఉండొచ్చని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.