Kids

చెడు పారేయడమే ఆనందం

చెడు పారేయడమే ఆనందం

అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి, రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులు లో నుండి పాడైనవి , కుళ్ళిపోయినవి తీసేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు. మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు. వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. ‘అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు. వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.

జీవితానుభవాలు అంతే. బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను , మనసులోంచి తీసేయాలి.

ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించాలి . సానుభూతి చూపాల్సిన వారిపై, సానుభూతి చూపాలి. విస్మరించిన వాళ్లను, విస్మరించాలి. ప్రశంసించిన వాళ్లను, ప్రశంసించాలి.

మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి. చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది. చిరునవ్వు, ఆనందం కవల పిల్లలు. ఒకటి లేకుండా మరొకటి లేదు.