Movies

బాలయ్యతో మాంచి మజాగా ఉండేది

బాలయ్యతో మాంచి మజాగా ఉండేది

బాలకృష్ణ ఎంతో సరదాగా ఉంటారని బాలీవుడ్‌ నటి, ప్రముఖ మోడల్‌ తనుశ్రీ దత్తా అన్నారు. 2010లో విడుదలైన ‘అపార్ట్‌మెంట్‌’ తర్వాత వెండితెరకు దూరంగా ఉన్న తనుశ్రీ ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈనేపథ్యంలో తాజాగా ఆమె తన సినీ కెరీర్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి స్పందించారు. టాలీవుడ్‌లో మంచి కథా చిత్రాలు తెరకెక్కుతాయని.. ఇక్కడ మనుషులు కూడా చాలా మంచి వారని ఆమె తెలిపారు.