Business

కారు ధరలు పెరుగుతున్నాయి-వాణిజ్యం

Car Rates To Go Up In India - Telugu Business News

* చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను య‌థాత‌థంగా కొన‌సాగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ ప‌థ‌కాల‌పై 2020-21 నాల్గ‌వ (జ‌న‌వ‌రి 1, 2021 నుంచి మార్చి 31,2021 వ‌ర‌కు) త్రైమాసికానికి ముందున్న వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయ‌ని తాజాగా ప్ర‌క‌టించింది. చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తుంది

* కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు చాలా మంది కారు వినియోగదారులు కొత్త మోడళ్ల కోసం ఎదురుచూస్తుంటారు. అలాగే కార్ల తయారీ సంస్థలు కూడా కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూనే, ఇప్పటికే విడుదలైన కార్ల ధరలను పెంచుతూ ఉంటారు. 2021 సంవత్సరానికి గాను ఇప్పటికే కొన్ని కార్ల తయారీ సంస్థలు ధరల పెరుగుదలను ప్రకటించారు.

* ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. కొత్త ఏడాదిలో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సరం నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. ‘ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ ఛార్జీలు(ఐయూసీ) విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ సేవలను పునరుద్ధరిస్తామని గతంలో చెప్పాం. ఆ హామీకి మేం కట్టుబడి ఉన్నాం. ఇకపై జనవరి 1, 2021 నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా జియో ద్వారా ఉచిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

* కొత్త సంవత్సరం వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ బహుమతి అందించింది. రైల్వే టికెట్లు బుకింగ్‌కు ఉపయోగించే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌ను సరికొత్త ఫీచర్లతో ఆధునికీకరించింది. యూజర్లు మరింత సులువుగా టికెట్లను బుక్‌ చేసుకునేందుకు కొత్త ఫీచర్లను జోడించింది. కొత్త వెబ్‌సైట్‌, యాప్‌ను రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ గురువారం ప్రారంభించారు.

* ఇల్లు కొనుగోలుకు ఇదొక మంచి సమయం . దసరా, దీపావళి, వంటి ముఖ్యమైన పండుగలతోపాటు , రిజర్వు బ్యాంకు మళ్ళీ రేపో రేటును తగ్గించడం, కేంద్ర ప్రభుత్వం కూడా ‘అందరికీ ఇళ్ళు ’ అనే నినాదం తో పన్ను రాయితీలను ప్రోత్సహించండం వంటివి చేస్తోంది. రిజర్వు బ్యాంకు నిర్దేశించినట్లు చాలా బ్యాంకులు తాము అందించే రుణాలకు, రేపో రేటును ఆధారంగా చేసుకుని, మరింత తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందిస్తున్నారు. అయితే, ఇవి కొత్తగా రుణాలు తీసుకోబోయే వారికి మాత్ర‌మే వర్తిస్తాయి. ఇంతకు మునుపే గృహ రుణాలు తీసుకున్నవారు ఒకవేళ రేపో రేటుకు మారదల్చుకున్నట్లైతే, కొంత అడ్మినిస్ట్రేటీవ్ ఛార్జీలు చెల్లించి త‌క్కువ వ‌డ్డీ రేటుకు మార‌వ‌చ్చు.