Movies

క్రాక్‌కి వెంకీ వాయిస్

క్రాక్‌కి వెంకీ వాయిస్

రవితేజ నటిస్తున్న ‘క్రాక్‌’ చిత్రంలో అగ్ర హీరో వెంకటేష్‌ సందడి కనిపించబోతుంది. అలాగని ఆయనేం తెరపై కనిపించరు.. తెర వెనుక నుంచి కథ నడిపిస్తారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. బి.మధు నిర్మాత. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాణాంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడీ చిత్రం కోసం వెంకటేష్‌తో వాయిస్‌ ఓవర్‌ చెప్పిస్తోంది చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే చిత్ర దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. రవితేజ, గోపీచంద్‌ మలినేని కలయికలో వస్తున్న మూడో చిత్రం. ఈ చిత్రానికి వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొత్త ఏడాది కానుకగా శుక్రవారం చిత్ర ట్రైలర్‌ విడుదల చేస్తున్నామ’’న్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.తమన్‌.