Health

అలర్జీలు ఉన్నా టీకాలు తీసుకోవచ్చు

అలర్జీలు ఉన్నా టీకాలు తీసుకోవచ్చు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోనా టీకా పంపిణీ మొదలైంది. ఇక మరి కొన్ని దేశాల్లో వ్యాక్సిన్‌ రెండు మోతాదులనూ తీసుకున్న వారు కూడా ఉన్నారు. కాగా, వారిలో కొందరికి జ్వరం, తలనొప్పి, టీకా ఇచ్చిన ప్రాంతంలో నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఇప్పటి వరకూ సుమారు పది మందిలో తీవ్ర స్థాయి అలర్జీ లక్షణాలు (ఎనాఫిలాక్సిస్‌) కనిపించాయి. ఈ టీకాల వల్ల అలర్జీ కలుగుతుందా? అనే సందేహం ప్రజల్లో తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో మసాచూసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌కు చెందిన అలర్జీ నిపుణుల బృందం వెల్లడించిన పరిశోధనా ఫలితాలు ఊరటనిస్తున్నాయి. సదరు పరిశోధనకు సంబంధించిన అంశాలు జర్నల్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ క్లినికల్‌ ఇమ్యునోలజీలో ప్రచురించారు.