Movies

₹1744కోట్లు

₹1744కోట్లు

సినిమాలు, బ్రాండ్‌ ప్రమోషన్లు అంటూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఎప్పుడూ ఫుల్‌ బిజీగా ఉంటారు. అందుకే అయన సంపాదన కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఒక్క ఏడాదిలో ఆరు సినిమాలు చేసినట్లు గతంలో పలు ఇంటర్వ్యూల్లో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. బాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్‌లలో అక్షయ్‌ పేరు కూడా ఉంటుంది. ఇంత బిజీగా ఉండే అక్షయ్ కుమార్ గత ఆరు ఆరేళ్ళలో ఎన్నో కోట్లు సంపాదించారో మీకు తెలుసా?. ఫోర్బ్స్ యొక్క తాజా నివేదిక ప్రకారం.. గత 6 సంవత్సరాలలో అక్షయ్ సంపాదన దాదాపు 1,744 కోట్లు అని తేలింది. (చదవండి: ఒక్క సినిమాకు రూ.135 కోట్లు తీసుకోనున్న హీరో?!2020 సంవత్సరంలో కూడా అక్షయ్ కుమార్ 48.5 మిలియన్ డాలర్లు(రూ.356.57 కోట్లు) తెలుస్తుంది. 2019 అయితే అక్షయ్ కుమార్ కి ఒక స్వర్ణ సంవత్సరం అని చెప్పాలి. 2019లో కేసరి, బ్లాంక్, మిషన్ మంగల్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూజ్‌తో సహా అతను ఇతర బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా 65 మిలియన్ డాలర్లు(రూ.459.22 కోట్లు) సంపాదించాడు. అలాగే 2018లో రూ.277.06 కోట్లు, 2017లో రూ.231.06 కోట్లు, 2016లో రూ.211.58 కోట్లు, 2015లో రూ.208.42 కోట్లు సంపాదించినట్టు పోర్బ్స్ తన కథనంలో పేర్కొంది. గత ఏడాదిలో అక్షయ్ కుమార్ కేవలం ఒకే ఒక్క సినిమా ‘లక్ష్మీ’తో అలరించాడు. ఈ ఏడాది 2021లో ఏకంగా మరో ఏడు సినిమాలతో బాలీవుడ్ పరిశ్రమలో మరోసారి తన సత్తా ఏంటో చూపించనున్నాడు.