Fashion

సారెలో చేపలు పెట్టి ఇస్తారు

సారెలో చేపలు పెట్టి ఇస్తారు

బెంగాలీలకు చేపలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, చాలామందికి తెలియంది ఏంటంటే… బెంగాలీ సంప్రదాయంలో అన్నప్రాసన దగ్గర్నుంచి పెళ్లీ, అంతిమ సంస్కారాల వరకూ ఎన్నో తంతుల్లో చేపలకు ముఖ్యమైన భాగం ఉంటుంది. వివాహాల సందర్భంలో అయితే పెళ్లికి ముందురోజు వధూవరులకు ఎవరింట్లో వారికి రుచికరమైన విందుని ఏర్పాటు చేస్తారు. దీనికోసం రకరకాల చేపల వంటకాలు ఉండాల్సిందే. ఇక, వధువుకు పసుపు రాసే పేరంటానికి వచ్చేటప్పుడు మెట్టినింటి వాళ్లు సారెతో పాటు పెద్దసైజులో ఉన్న రోహు రకం చేపల్ని కూడా తీసుకొస్తారు. వీటిలో ఒక చేపకు చీరకట్టి, సిందూరం పూసి, నగలు, ముక్కుపుడక పెట్టి వధువులా తయారుచేస్తారు. మరో చేపను వరుడిలా అలంకరిస్తారు. ఇలా చేపల్ని ఇస్తే కొత్త జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందన్నది వారి నమ్మకం. కొందరైతే స్వీట్లను కూడా చేపల్లా తయారు చేస్తారు. కొత్త పెళ్లికూతురు అత్తారింటిలో అడుగుపెట్టినప్పుడు కూడా చేప బొమ్మల్ని చూపిస్తారట. ఆశ్చర్యంగా ఉంది కదూ..!