Devotional

చినజీయర్ రాష్ట్రవ్యాప్త పర్యటన

Chinajeeyar Swamy To Tour Andhra Worried Over Attacks On Temples

చినజీయర్ స్వామి ప్రెస్ మీట్..

రాష్ట్రంలో డేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి.

ఇప్పటికి 50కి పైగా సంఘటనలు జరిగాయి.

ఇవాళ సింగరాయకొండపై వెలసిన నరసింహ స్వామి వారి చేతులు ద్వంసం చేశారు.

ఎవరు చేస్తున్నారనేది అప్రస్తుతం.. కానీ పునరావృతం కాకుండా చూడాలి.

దాడులకు గురైన ఆలయాలను సందర్శించి, స్థానికుల అభిప్రాయాలను తెలుసుకోవాలి.

ధర్మ జాగరణ చేసే పెద్దలను కలిసి ఏం చేయాలో ఆలోచిస్తాం

రక్షణ కోసం కెమెరాలు పెట్టాలనే ఆదేశాలున్నా అమలు కావడం లేదు.

ఆలయాల్లో బాధ్యులుగా ఉండే వ్యవస్థను నిర్మూలించి, పాలనాపరంగా మార్చేశారు.

ఇప్పుడు వరుస దాడులతో లోపాలు బయటపడుతున్నాయి.

జరిగిన సంఘటనలకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవాలి.

తర్వాత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

పెద్దల సలహాలు, సూచనలు తీసుకుని ఉపశమన చర్యలు

ధనుర్మాస ఉత్సవాల అనంతరం 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తాం.

ఆలయాల ఉనికికే భంగం కలిగించే స్థితి వచ్చిన నేపథ్యంలో మేం మౌనంగా ఉండలేం.

ఇంటెలిజెన్స్ విభాగంతో సమర్థమైన కమిటీ వేసి విచారణ జరపాలి.

ఎవరు చేశారో కనిపెట్టి గట్టిగా దండించాలి.

వ్యక్తుల మీద ద్వేషం కోసం ఇలా చేయకూడదు.

చర్చి, మసీదులపై దాడి జరిగి ఉంటే ప్రపంచ వ్యాప్తంగా స్పందన వచ్చేది.

ఆలయాలపై జరిగితే ఎవరూ అడగలేరనే అభిప్రాయం సరికాదు.

ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి సరైన నిర్ణయం ప్రకటించాల్సి ఉన్నా జరగలేదు.

మతపరమైన విషయాల్లో రాజకీయ పార్టీలను ముడిపెట్టడం తగదు.

ఆధ్యాత్మిక కేంద్రమైన ఆలయాలను అలాగే చూడాలి.

మాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు.

ఒకరిపై నేరారోపణ చేయాలని అనుకోవడం లేదు.

ప్రభుత్వం, సమాజం స్పందించాలి. ప్రయివేటు ఆలయాలు 19 మాత్రమే. మిగిలినవన్నీ దేవదాయ శాఖ పరిధిలో ఉన్నవే