WorldWonders

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నాంపల్లి ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అబిడ్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కమల్‌ బాన్‌ అత్యాచారానికి పాల్పడినట్లు 2017లో కేసు నమోదైంది. మూడుళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. నిందితుడికి బుధవారం నాంపల్లి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి హేమలత 20 ఏళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.