Fashion

ఏమిటి స్ఫటిక మాల గొప్పదనం?

ఏమిటి స్ఫటిక మాల గొప్పదనం?

1. ఆధ్యాత్మికంగా స్పటిక కు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది.
2. స్పటికం తో తయారుచేయబడిన దేవతామూర్తులను పూజించడం, ఆరాధించడం వలన అపారమైన సానుకూలత లభిస్తుంది
3. స్పటిక లింగానికి నెలకు రెండు సార్లైనా నీటితో అభిషేకం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మన ఇంటినందు పూజ గదిలో బొటన వేలి అంత శివలింగము కానీ దేవతామూర్తి విగ్రహము కానీ పెట్టుకుని పూజ చేసుకోవచ్చు, గృహస్తు ఇంటి యందు పూజగదిలో శివలింగము బొటనవేలు సైజు కు మించి ఎత్తు ఉండరాదు.
4. స్పటిక లింగానికి ప్రతికూల శక్తిని తనలోనికి గ్రహించి సానుకూల శక్తిని ప్రసాదించే సామర్థ్యం కలిగి ఉన్నది.
5. స్పటిక లింగం ఇంట్లో ఉంటే మానసిక ఆందోళనలు, భయ ఆందోళనలు, ఈతిబాధలు రుగ్మతలు తొలగిపోతాయి.
6. స్పటిక మాల ధరించడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శరీరము లోనికి ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. రక్తపోటు ఉన్నవారు స్పటిక మాల ధరించడం వలన మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతారు. స్నానం చేసేటప్పుడు స్పటిక మాల ధరించి స్నానం చేయడం మంచిది. స్పటిక మాల తో శివ నామాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేయడం వలన ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయి.
7. స్పటిక మాల ధరించే ముందు ఆ మాలను మూడు గంటలు నీటిలో నానబెట్టి ధరించడం మంచిది.
8. ఒకరు ధరించిన స్పటిక మాల ను ఇంకొకరు అసలు ధరించకూడదు.
9. రోజంతా స్పటిక మాల ధరించిన వారు మానసిక ఒత్తిడి దూరమవుతుంది అని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
10. శరీరం మీద ధరించే స్పటిక మాలను ధ్యాన ప్రక్రియలో కాని, జప మాలగా కానీ వాడ రాదు